UPI payments | యూపీఐ లావాదేవీలపై ఛార్జెస్ జనవరి నుంచి?.. త్వరలో అధికారికంగా స్పష్టతవచ్చే అవకాశం
UPI payments | యూపీఐ (UPI) ద్వారా జరిగే రూ.2000పైన లావాదేవీలపై ప్రతిపాదించిన ఛార్జీల అమలును కొన్ని నెలలపాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం (Union Govt) యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు పండగల సీజన్ (Festive season) ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తున్నది.
UPI payments : యూపీఐ (UPI) ద్వారా జరిగే రూ.2000పైన లావాదేవీలపై ప్రతిపాదించిన ఛార్జీల అమలును కొన్ని నెలలపాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం (Union Govt) యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు పండగల సీజన్ (Festive season) ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తున్నది. దీనిపై త్వరలోనే అధికారికంగా స్పష్టతవచ్చే అవకాశం ఉన్నది.
రూ.2,000 కంటే ఎక్కువ విలువైన మర్చంట్ యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఛార్జీలను అక్టోబర్ 15 నుంచి అమలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. అయితే ఈ గడువును వచ్చే ఏడాది జనవరి వరకు పొడిగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ నిర్ణయంవల్ల పేమెంట్ కంపెనీలు తమ సాంకేతిక వ్యవస్థలను ఆధునికీకరించుకోవడానికి సమయం దొరుకుంది.
అదేవిధంగా పండగల సీజన్లో వ్యాపారులపై అదనపు ఛార్జీల భారం పడకుండా ఉంటుంది. కాగా ఆరేళ్లకుపైగా ఎలాంటి రుసుము లేకుండా కొనసాగుతున్న యూపీఐ చెల్లింపులపై ఈ ఛార్జీలను ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఇది వినియోగదారులకు ప్రత్యక్షంగా వర్తించదు. ఇది వ్యాపారులవైపు నుంచి చెల్లించాల్సిన ఇంటర్‌ఛేంజ్ రుసుము. ప్రస్తుతం దేశంలో 50 కోట్లకుపైగా యూపీఐ వినియోగదారులు ఉన్నారు.
ఆగస్టు 2026 లోనే యూపీఐ ద్వారా రూ.29.82 లక్షల కోట్ల విలువైన 2,451 కోట్ల లావాదేవీలు జరిగాయంటే దీని ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. అక్టోబర్ 15 నుంచి ఛార్జీల అమలు మొదలుపెడితే అది దసరా, దీపావళి వంటి పండగల వేళ వినియోగదారుల కొనుగోళ్లపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కీలక సమయంలో రిటైల్ చెల్లింపులకు అంతరాయం కలుగకుండా చూడాలనేది ప్రధాన ఉద్దేశం.
అదే సమయంలో ఈ అదనపు గడువులో పేమెంట్ కంపెనీలు తమ సాంకేతిక వ్యవస్థలను మెరుగుపరుచుకోవడానికి, ఛార్జీల భారాన్ని వినియోగదారులపై పడకుండా ఎలా సర్దుబాటు చేయాలో ప్రణాళిక రచించుకోవడానికి సమయం లభించనుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

