TVS | స్టన్నింగ్ డిజైన్‌తో ఆకట్టుకోనున్న టీవీఎస్ రొనిన్..ఫస్ట్ లుక్ రిలీజ్
జులై 6న టీవీఎస్ న్యూ బైక్ రొనిన్ లాంఛ్ కానుండగా ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. క్రూజర్ మోటార్‌సైకిల్‌గా కస్టమర్ల ముందుకు రానున్న రొనిన్ ఫస్ట్ లుక్ ఇదేనంటూ సోషల్ మీడియాలో బైక్ ఇమేజ్‌లు వైరలవుతున్నాయి.
న్యూఢిల్లీ : జులై 6న టీవీఎస్ న్యూ బైక్ రొనిన్ లాంఛ్ కానుండగా ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. క్రూజర్ మోటార్‌సైకిల్‌గా కస్టమర్ల ముందుకు రానున్న రొనిన్ ఫస్ట్ లుక్ ఇదేనంటూ సోషల్ మీడియాలో బైక్ ఇమేజ్‌లు వైరలవుతున్నాయి. స్ర్కాంబ్లర్,కేఫ్ రేసర్ డిజైన్లను మేళవిస్తూ రొనిన్ మోడర్న్ లుక్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. న్యూ బైక్ రొనిన్ రౌండ్ హెడ్‌లైట్‌తో పాటు ముందు భాగంలోని ఫ్యూయల్ ట్యాంక్‌ను టియర్ డ్రాప్ టైప్ డిజైన్‌తో రూపొందించడంతో బైక్ కేఫ్ రేసర్‌ను గుర్తుకుతెచ్చేలా ఉంది.
రియర్ సెక్షన్ కేఫ్ రేసర్, స్క్రాంబర్ల తరహా డిజైన్‌ను పోలిఉంది. రొనిన్ కర్వ్డ్ ఫెండర్స్, డ్యూయల్ టోన్ పెయింట్, బ్లాక్డ్ అవుట్ ఇంజన్ వంటి ప్రత్యేకతలను కలిగిఉంది. ముందుభాగంలో యుఎస్డి ఫోర్క్స్, రియర్ భాగంలో మోనో-షాక్‌తో స్పోర్టీ, అడ్వంచర్ అప్పీల్‌తో ఆకట్టుకుంటుంది. ఇక జులై 6న రొనిన్ను టీవీఎస్ లాంఛ్ చేస్తుండగా ఆపై త్వరలో బుకింగ్స్‌ను ఓపెన్ చేసేందుకు కంపెనీ సన్నద్ధమవుతోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

