చెన్నై, డిసెంబర్ 9: ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్ మోటర్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త అపాచీ 160 4వీ మోటార్‌సైకిల్‌ను పరిచయం చేసింది. డ్యూయల్ చానెల్ ఏబీఎస్, వాయిస్ అసిస్ట్ కలిగిన ఈ బైకు ధరను రూ.1,34,990గా నిర్ణయించింది. ఈ ధరలు తమిళనాడు షోరూంకు సంబంధించినవి. ప్రస్తుత పండుగ సీజన్లో సంస్థ విడుదల చేసిన మూడో మాడల్ ఇది కావడం విశేషం.