Gold Rates | పది రోజుల్లో రూ.2800 పెరిగిన బంగారం.. వెండిది కూడా అదే బాట.. కారణాలివి..!
Gold Rate | దేవీ నవరాత్రి ఉత్సవాలతోపాటు అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పది రోజులుగా తులం బంగారం ధర రూ. 2840 పెరిగింది.
Gold Rates | దేవీ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో భారతీయులు బంగారం కొనుగోళ్లు చేస్తుంటారు. శుభముహూర్తంలోనే బంగారంపై పెట్టుబడులు పెడుతుంటారు. ప్రభుత్వ బాండ్ల విలువ పడిపోవడంతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీరేట్లు పెంచక తప్పదని యూఎస్ ఫెడ్ రిజర్వ్ ప్రకటించడంతో డాలర్ విలువ బలహీన పడింది. ఫలితంగా ఇన్వెస్టర్లకు బంగారం ఆల్టర్నేటివ్ పెట్టుబడి ఆప్షన్‌గా మారింది. దీనికితోడు మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గత వారం రోజులుగా దేశీయ మార్కెట్లో ఇటీవలి కాలంలో క్రమంగా బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. పరిస్థితులు ఇలాగే సాగితే ధంతేరాస్, దీపావళి పర్వదినం నాటికి తులం బంగారం ధర రూ.62 వేల మార్క్‌ను దాటేస్తుందని ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లరీ అసోసియేషన్, బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ నెల 12న హైదరాబాద్‌లో తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.58,910 పలికితే, శనివారం (అక్టోబర్ 21) రూ.61,750 పలుకుతోంది. అంటే పది రోజుల్లో రూ.2840 పెరిగింది. మరోవైపు కిలో వెండి ధర ఈ నెల 12న రూ.75,500 పలికితే, శనివారం రూ.78,700 వద్ద ట్రేడయింది. అంటే రూ.3200 పెరిగింది.
ఢిల్లీలో శనివారం 24 క్యారట్ల బంగారం ధర తులం రూ.200 పెరిగి రూ.61,900 పలికింది. ఈ నెల 12న రూ.59,060 వద్ద స్థిర పడింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.54,150 (అక్టోబర్ 12) నుంచి శనివారం రూ.56,750 వద్ద నిలిచింది. కిలో వెండి ధర ఈ నెల 12న రూ.72,600 పలుకగా, శనివారం 75,300 వద్ద ట్రేడయింది.
కర్ణాటక రాజధాని బెంగళూరు, మహారాష్ట్ర రాజధాని ముంబైలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.220 పెరిగి రూ.61,750 వద్ద స్థిర పడింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.56,600 వద్ద ముగిసింది. కిలో వెండి ధర ఈ నెల 12న రూ.72,600 పలికితే, ఈ నెల 21న రూ.75,300 వద్ద ట్రేడయింది.
చెన్నైలో ఈ నెల 12న తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.59,070 పలికితే, శనివారం రూ.61,850 వద్ద స్థిర పడింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం ధర రూ.54,150 నుంచి రూ.56,700లకు పెరిగింది. అలాగే కిలో వెండి ధర ఈ నెల 12న రూ.75,500 పలికితే, శనివారం రూ.78,700 వద్ద ముగిసింది.
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.58,910 (అక్టోబర్ 12) నుంచి రూ.61,750 (అక్టోబర్ 21) లకు పెరిగింది. కిలో వెండి ధర రూ.72,600 నుంచి రూ.75,300లకు దూసుకెళ్లింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

