Train Tickets | ఇలా చేస్తే రైలు టిక్కెట్లపై డిస్కౌంట్.. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే
Train Tickets : రైళ్లలో ఎక్కువగా ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర రైల్వే శాఖ. ఇకపై రైలు టిక్కెట్లు డిస్కౌంట్‌కే లభించనున్నాయి. అయితే, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా మాత్రమే ఈ డిస్కౌంట్ లభిస్తుంది.
Train Tickets : రైళ్లలో ఎక్కువగా ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర రైల్వే శాఖ. ఇకపై రైలు టిక్కెట్లు డిస్కౌంట్‌కే లభించనున్నాయి. అయితే, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా మాత్రమే ఈ డిస్కౌంట్ లభిస్తుంది. రైల్వే శాఖలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంపొందించే లక్ష్యంతో తాజాగా డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది ఇండియన్ రైల్వేస్. ఈ ఆఫర్ అన్ రిజర్వుడ్ టిక్కెట్లకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా రైల్‌వన్ యాప్‌లో బుక్ చేసుకుంటేనే.
ప్రయాణికులు రైల్‌వన్ యాప్‌లో డిజిటల్ పేమెంట్ మోడ్‌లో టిక్కెట్స్ బుక్ చేసుకుంటే 3 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. యూపీఐ, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ ద్వారా రైల్‌వన్ యాప్ నుంచి టిక్కెట్లు బుక్ చేసుకుని 3 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. నగదు రహిత సేవల్ని ప్రోత్సహించే లక్ష్యంతో రైల్వే శాఖ ఈ పని చేసింది. ఇది ప్రతి రోజూ తక్కువ దూరాలకు రైళ్లలో ప్రయాణించేవారికి ఉపయోగపడుతుందని రైల్వే విభాగం తెలిపింది. చాలా మంది ప్రయాణికులు ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపార అవసరాల కోసం రోజూ అన్ రిజర్వుడ్ సీట్లు బుక్ చేసుకుని ప్రయాణిస్తుంటారు. అలాంటివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
ఈ ఆఫర్ ఈ ఏడాది జూలై 14 వరకే అందుబాటులో ఉంటుంది. ఈ పేమెంట్ విధానం ద్వారా తక్కువ ధరకే ప్రయాణికులు సులభంగా, తేలికగా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇది ఒక్క టిక్కెట్‌పై 3 శాతం డిస్కౌంట్లా కనిపించినప్పటికీ.. రోజూ ప్రయాణించే వారి కోసం కాబట్టి.. నెలవారీగా చూస్తే మంచి లాభమే ఉంటుందని రైల్వే వర్గాలు అంటున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

