Toyota Urban Cruiser Taisor | మారుతి ఫ్రాంక్స్ టెక్నాలజీతో టయోటా అర్బన్ క్రూయిజర్ టైసోర్.. రూ.7.73 లక్షల నుంచి షురూ..!
టయోట కిర్లోస్కర్ మోటార్ (Toyota Kirloskar Motor) తన న్యూ అర్బన్ క్రూయిజర్ టైసోర్ (Toyota Urban Cruiser Taisor) అనే ఎస్యూవీ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Toyota Urban Cruiser Taisor | ప్రతి ఒక్కరూ ఎస్యూవీ కార్లపై మోజు పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టయోట కిర్లోస్కర్ మోటార్ (Toyota Kirloskar Motor) .. న్యూ అర్బన్ క్రూయిజర్ టైసోర్ (Toyota Urban Cruiser Taisor) అనే ఎస్యూవీ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. మారుతి సుజుకి సబ్ కంపాక్ట్ ఎస్యూవీ ఫ్రాంక్స్ డిజైన్ ఆధారంగా రూపుదిద్దుకున్న టయోటా న్యూ అర్బన్ క్రూయిజర్ టైసోర్ ధర రూ.7.73 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. న్యూ స్టైలింగ్ డిజైన్‌తో వస్తున్నది. గ్లోస్ బ్లాక్‌లో బోల్డర్ హానీకాంబ్ మెష్ గ్రిల్లె, న్యూ ట్విన్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ విత్ టయోటా లోగో ఇన్ సెంటర్ ఫీచర్లు ఉంటాయి.
టయోటా న్యూ అర్బన్ క్రూయిజర్ టైసోర్ (Toyota Urban Cruiser Taisor) బూట్ పై లైట్ బార్ కనెక్ట్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, రాక్డ్ రేర్ విండ్ స్క్రీన్ తో మరింత స్టయిలిష్‌గా ఉంటుంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్‌లో మాదిరిగా టయోటా న్యూ అర్బన్ క్రూయిజర్ టైసోర్ కారులో ఇంటీరియర్‌గా 9-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ట్విన్ పాడ్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్ విత్ ఎంఐడీ యూనిట్ ఇన్ సెంటర్ తో వస్తున్నది. న్యూ డ్యుయల్ టోన్ ట్రీట్మెంట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కంపాటిబిలిటీ, 360-డిగ్రీ కెమెరా, హెడ్ అప్ డిస్ ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ విత్ డీఆర్ఎల్స్, సిక్స్-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, సౌకర్యవంతంగా రేర్ ఏసీ వెంట్స్ ఉంటాయి.
టయోటా న్యూ అర్బన్ క్రూయిజర్ టైసోర్ (Toyota Urban Cruiser Taisor) కారు 1.2 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్, 1.0 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తున్నది. 1.2 లీటర్ల ఇంజిన్ గరిష్టంగా 89 బీహెచ్పీ విద్యుత్, 113 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. టర్బో చార్జిడ్ 1.0 లీటర్ల కారు ఇంజిన్ 99 బీహెచ్పీ విద్యుత్, 148 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లతో వస్తుంది. నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ కారు 5-స్పీడ్ ఏఎంటీ, 1.0 లీటర్ల టర్బో చార్జిడ్ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్, సీఎన్జీ పవర్ ట్రైన్ ఇంజిన్ ఆప్షన్‌తో కూడిన కారు కూడా లభిస్తుంది.
నిస్సాన్ మ్యాగ్నైట్, రెనాల్ట్ కైగర్, హ్యుండాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, కియా సొనెట్, మారుతి ఫ్రాంక్స్ వంటి సబ్ కంపాక్ట్ ఎస్యూవీ కార్లతో పోటీ పడుతుంది టయోటా న్యూ అర్బన్ క్రూయిజర్ టైసోర్. మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు ధరలు రూ.7.51 లక్షల నుంచి రూ.9.72 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

