Tiago EV | అద్భుత ఫీచర్లు.. చౌకగా త్వరలో విపణిలోకి టాటా టియాగో ఈవీ?!
Tiago EV | చౌక ధరకే ఎంట్రీ లెవల్ టియాగో ఈవీ కారును ఈ నెలాఖరులోగా మార్కెట్లోకి తేవాలని టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తున్నది.
Tiago EV | దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో టాటా మోటార్స్ దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే మూడు ఈవీ కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చిన టాటా మోటార్స్.. ఈ నెలాఖరులోగా ఎంట్రీ లెవెల్ మోడల్ టియాగో ఈవీని తేవడానికి సన్నాహాలు పూర్తి చేసింది. టాటా మోటార్స్ ఈవీ కార్లలో టియాగో ఈవీ.. చౌక ధరకే లభిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు నెక్సాన్ ఈవీ, ఎక్స్‌ప్రెస్-టీ ఈవీ, టైగోర్ ఈవీ కార్లను ఆవిష్కరించింది. నెక్సాన్ ఈవీ, టైగోర్ ఈవీ పర్సనల్ మొబిలిటీ సెగ్మెంట్లోకి వస్తే ఎక్స్‌ప్రెస్-టీ.. ఫ్లీట్ క్యాటగిరీలోకి వస్తుంది. ఇప్పటికే భారత్ ఈవీ కార్ల మార్కెట్లో 88 శాతం వాటాను టాటా మోటార్స్ సొంతం చేసుకోవడంలో నెక్సాన్ ఈవీ ప్రధాన కారణం.
తమ సంస్థ సమగ్ర ఈవీ పోర్ట్‌ఫోలియో నిర్మాణంలో మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర చెప్పారు. తదుపరి దశలో ఈవీ మార్కెట్ విస్తరణలో తక్కువ కాస్ట్‌తో అందుబాటులోకి తేవడంతోపాటు తేలిగ్గా డ్రైవ్ చేయగల సామర్థ్యం గల వాహనాలను ఆవిష్కరిస్తామన్నారు. త్వరలో టియాగో ఈవీ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలను వెల్లడిండానికి టాటా మోటార్స్ ప్రణాళికలు రూపొందిస్తున్నది.
ఎక్స్‌ప్రెస్-టీ ఈవీ తరహాలోనే టియాగో ఈవీ కూడా 41 హెచ్‌పీ సామర్థ్యం గల ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుందని భావిస్తున్నారు. రెండు బ్యాటరీ ఆప్షన్లలో వినియోగదారులకు లభ్యం కానున్నది. 165 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల సామర్థ్యంతో 16.5కిలోవాట్ల బ్యాటరీ, 213 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల సామర్థ్యంతో 21.5 కిలోవాట్ల బ్యాటరీ అమరుస్తారు. స్ప్లిట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్‌తోపాటు జిప్ట్రాన్ పవర్ట్రైన్ ఫీచర్ కూడా జోడిస్తారు.
టాటా మోటార్స్‌లో ఎక్స్‌ప్రెస్-టీ ఎలక్ట్రిక్ సెడాన్ కారు ధర రూ.9.75 లక్షలు. ఇది రవాణ అవసరాలకు ఉపయోగిస్తారు. సాధారణంగా పర్సనల్ మొబిలిటీ కింద వాడే ఎలక్ట్రిక్ కార్లలో టైగోర్ ఈవీ అత్యంత చౌకగా రూ.12.49 లక్షలకు లభిస్తుంది. మార్కెట్లోకి చౌక ధరకు విద్యుత్ కారును తేవడానికి టాటా మోటార్స్ రూ.10 లక్షలకే టియాగో ఈవీని కస్టమర్లకు అందించొచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

