Interest Rates on Fixed Diposits | వృద్ధులకు రిలీఫ్.. ఈ బ్యాంకుల్లో ఎఫ్డీలపై అధిక వడ్డీరేట్లు
Interest Rates on Fixed Diposits | కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు వృద్ధులకు ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠ వడ్డీరేటు ఆఫర్ చేస్తున్నాయి.
Interest Rates on Fixed Diposits | ఆకాశాన్నంటే స్థాయిలో దూసుకుపోతున్న నిత్యావసర వస్తువుల ధరల ప్రభావానికి కళ్లెం వేసేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. గత నెల నుంచి రెండుసార్లు రెపోరేట్ 90 బేసిక్ పాయింట్లు పెంచేసింది. ఇది పలు బ్యాంకులు తమ కీలక వడ్డీరేట్లు పెంచడానికి మార్గం సుగమం చేసింది. వడ్డీరేట్ల పెంపు నిర్ణయం వివిధ బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేసేవారికి శుభవార్తే అవుతుంది. గత ఆరేండ్లలో వడ్డీరేట్లు 40 శాతం తగ్గాయని డిపాజిటర్లు చెబుతున్నారు. 2014 సెప్టెంబర్లో ఎస్బీఐ గరిష్ఠంగా డిపాజిటర్లకు తొమ్మిది శాతం వడ్డీరేటు ఆఫర్ చేస్తే 2020 మేలో 5.4 శాతానికి పడిపోయింది. తాజాగా వడ్డీరేట్లు పెంచడంతో ఆయా ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపైనా వడ్డీరేట్లు పైపైకి దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తున్నది.
ప్రత్యేకించి సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఫిక్స్డ్ దిపాజిట్ ఫథకాలు ఆఫర్ చేస్తున్నాయి. ఇతరులకంటే సీనియర్ సిటిజన్లకు 50 బేసిక్ పాయింట్లు ఎక్కువ వడ్డీ అందిస్తున్నాయి. కొన్ని చిన్న బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా అధిక వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్నాయి. కానీ ఇన్వెస్టర్లు బ్రాండ్ నేమ్ ఉన్న బ్యాంకులకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
అయినప్పటికీ జూన్ 9 నుంచి చిన్న బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏడు శాతం వడ్డీరేటు ఆఫర్ చేస్తున్నాయి. రూ.10 వేలు జమ చేస్తే, మూడు నెలల్లోనే రూ.11,488.82 అవుతుంది.
ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు ఆయా బ్యాంకులు ఆఫర్ చేసే వడ్డీరేట్ల వివరాలిలా..
బ్యాంకు ———————— ఏడాది — రెండేండ్లు — ఐదేండ్లు
(వడ్డీరేటు శాతాల్లో)
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ — 5.75% —– 7.25 —— 7.25
ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ — 6.6 ——- 7 —- 6.5
ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ —— 6.5 —– 7 ———- 7.25
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ — 7 —— 7.5 ——– 7.25
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ——- 7 ——— 7 ———- 6.75
ఉత్కర్స్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ —— 7.4 ——– 7.25 ——- 7.25
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ———— 7.3 ——– 7.55 —— 7.55
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

