Oil Palm | సంగారెడ్డి జిల్లాలో ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్.. గోద్రెజ్ అగ్రోవెట్‌కు 47 వేల ఎకరాలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
Oil Palm | తెలంగాణలో ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల విస్తరణపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలోనే ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూ వస్తున్న ప్రభుత్వం.. ఆ రంగంలోని ప్రముఖ సంస్థ గోద్రేజ్ అగ్రోవెట్‌కు భారీ ఎత్తున 47వేల ఎకరాల భూమిని కేటాయించింది.
Oil Palm | హైదరాబాద్, జూలై 18 (బిజినెస్ బ్యూరో): తెలంగాణలో ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల విస్తరణపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలోనే ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూ వస్తున్న ప్రభుత్వం.. ఆ రంగంలోని ప్రముఖ సంస్థ గోద్రేజ్ అగ్రోవెట్‌కు భారీ ఎత్తున 47వేల ఎకరాల భూమిని కేటాయించింది. సంగారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు వీలు గా, అక్కడ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు తగ్గట్టుగా ఈ భూ కేటాయింపులు జరిగాయి. దీంతో జిల్లాలోని ఆయిల్ పామ్ రైతాంగానికేగాక, రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంటను సాగు చేస్తున్న రైతులందరికీ లబ్ధి చేకూరనున్నది. ప్లాంట్ల ఏర్పాటుతో కొత్తగా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ రానున్నాయి.
రైతు ప్రోత్సాహక నిర్ణయం
తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు, ఈ ప్రాంత రైతుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ ఎండీ బలరామ్ సింగ్ యాదవ్ మంగళవారం స్పష్టం చేశారు. ఆయిల్ పామ్ పంట, ప్లాంట్ల ఏర్పాటుకు వీలుగా భారీ స్థాయిలో భూములను కేటాయించిన తెలంగాణ వ్యవసాయ, సహకార శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో రైతుల ప్రగతికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికీ ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కాగా, దాణా, పంట సంరక్షణ, పామాయిల్, డైరీ, పౌల్ట్రీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ రంగాల్లో గోద్రెజ్ అగ్రోవెట్స్ ప్రముఖ సంస్థగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ.2,088.80 కోట్లుగా ఉన్నది.
5 శాతానికిపైగా ఎగిసిన షేర్లు
తెలంగాణ ప్రభుత్వం గోద్రేజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ వ్యాపారానికి 47వేల ఎకరాల భూమిని కేటాయించిన నేపథ్యంలో ఆ సంస్థ షేర్లు దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒక్కసారిగా ఆకర్షణీయంగా మారాయి. మంగళవారం ట్రేడింగ్‌లో మదుపరులు ఎగబడి కొనేయడంతో అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో, ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)లో షేర్ విలువ 5 శాతానికిపైగా ఎగిసింది. బీఎస్ఈలో 5.43 శాతం పుంజుకుని రూ.499.05 వద్ద ముగిసిన గోద్రేజ్ అగ్రోవెట్ షేర్ విలువ.. ఎన్ఎస్ఈలో 5.42 శాతం అందుకుని రూ.498.20 వద్ద నిలిచింది.
‘ఆయిల్ పామ్ వ్యాపారంలో మూడు దశాబ్దాలకుపైగా అనుభవం మాకున్నది. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు రైతులతో కలిసి కృషి చేస్తాం. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో రాబోయే కొన్నేండ్లలో ఆయిల్ పామ్ దిగుమతులపై భారత్ ఆధారపడకుండా చేయగలమన్న నమ్మకం కలుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం మాపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం’
-బలరామ్ సింగ్ యాదవ్, గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ ఎండీ
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

