Elon Musk | ఎలన్‌మస్క్ సంచలనం.. 75 శాతం బిట్కాయిన్ల విక్రయం.. అందుకేనా?!
Elon Musk | ఎలన్‌మస్క్ సారధ్యంలోని కార్ల సంస్థ టెస్లా.. 75 శాతం బిట్ కాయిన్ నిల్వలను నగదు మార్చుకున్నట్లు సమాచారం.
Elon Musk | ఎలన్‌మస్క్ సారధ్యంలోని విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. గతంలో కొనుగోలు చేసిన క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ నిల్వల్లో గణనీయ భాగం విక్రయించేసింది. గత నెలాఖరు నాటికి 75 శాతం బిట్ కాయిన్‌ను నగదుగా మార్చుకున్నట్లు సమాచారం. రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాలపై వాటాదారులకు ఎలన్‌మస్క్ రాసిన లేఖలో 936 మిలియన్ల నగదు నిల్వలు ఉన్నాయని పేర్కొన్నట్లు తెలిసింది.
ఉధృతంగా ఉన్న కొవిడ్-19 కేసులను కట్టడి చేయడానికి చైనాలో షట్డౌన్లు విధించడంతో తలెత్తిన అనిశ్చితి వల్ల బిట్‌కాయిన్ టోకెనట్లు విక్రయించినట్లు ఎలన్‌మస్క్ తెలిపారు. కానీ, దీన్ని బిట్‌కాయిన్ పట్ల వ్యతిరేక నిర్ణయంగా పరిగణించరాదని ఆయన పేర్కొన్నారు.
చైనాలో లాక్డౌన్ల వల్ల మొత్తం కంపెనీ ద్రవ్య లభ్యత పట్ల ఆందోళనతో బిట్ కాయిన్ టోకెన్లు విక్రయించామని తెలిపారు. గతేడాది ఎలన్‌మస్క్.. క్రిప్టో కరెన్సీలకు ప్రధాన మద్దతుదారుగా నిలిచారు. గతేడాది డోజ్ కాయిన్లకు మద్దతుగా ట్వీట్లు చేశారు. గత ఏప్రిల్‌లో ఆస్టిన్లోని న్యూ కంపెనీలో డోజ్కాయిన్ ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ మధ్య విందు ఏర్పాటు చేశారు. ఏడాది క్రితం బిట్ కాయిన్ సదస్సులో పాల్గొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

