Tesla | భారత్‌లో టెస్లా ‘Y’ మోడల్ కార్ల అమ్మకాలు.. రూ.59.89 లక్షల నుంచి ప్రారంభం
Tesla | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం (electric cars) టెస్లా (Tesla) భారత్‌లో తొలి షోరూంను ప్రారంభించిన విషయం తెలిసిందే.
Tesla | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం (electric cars) టెస్లా (Tesla) భారత్‌లో తొలి షోరూంను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని మేకర్ మ్యాక్సిటీ మాల్లో టెస్లా తన తొలి షోరూంను గ్రాండ్‌గా లాంఛ్ చేసింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో అత్యధిక అమ్మకాలతో రికార్డు నెలకొల్పిన ‘వై’ మోడల్ కార్లను (Tesla Y Model) భారత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.
భారత్‌లో RWD (రియర్-వీల్ డ్రైవ్), లాంగ్-రేంజ్ RWD వేరియంట్ కార్లను అమ్మకానికి ఉంచింది. ఇక ధర విషయానికొస్తే రియర్-వీల్ డ్రైవ్ (ఆర్డబ్ల్యూడీ) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు, లాంగ్-రేంజ్ ఆర్డబ్ల్యూడీ వేరియంట్ ధరను రూ. 67.89 లక్షలుగా నిర్ణయించింది. వీటి ‘ఆన్ రోడ్’ ధరల్ని పరిశీలిస్తే RWD వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 61.07 లక్షలుకాగా, లాంగ్-రేంజ్ వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 69.15 లక్షలుగా ఉంది. టెస్లా అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఇందులో 18 శాతం జీఎస్టీతో సహా రూ. 50,000 అడ్మినిస్ట్రేషన్, సర్వీస్ ఫీజు కూడా ఉంటుంది.
ఈ వాహనాలు చైనాలోని టెస్లా షాంఘై గిగాఫ్యాక్టరీ నుంచి దిగుమతయ్యాయి. ఈ వై మోడల్ వేరియంట్ ధరలు అమెరికాలో 44,990 డాలర్లు (భారత కరెన్సీలో రూ.38.63 లక్షలు), చైనాలో 2,63,500 యువాన్ (రూ.31.57 లక్షలు), జర్మనీలో 45,970 యూరోలు (రూ.46.09 లక్షలు)గా ఉన్నాయి. వీటితో పోలిస్తే భారత్‌లోనే ఈ వై మోడల్ ధరలు అధికం కావడం గమనార్హం. దిగుమతి సుంకం, లాజిస్టిక్స్ ఖర్చులే ధర పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.
Also Read..
Tesla | ముంబైలో టెస్లా తొలి షోరూం.. నెల అద్దె ఎంతో తెలుసా..?
Tesla | భారత్‌లో టెస్లా తొలి షోరూం ప్రారంభం
X Down | ఎక్స్ సేవల్లో మళ్లీ అంతరాయం.. ప్రపంచ వ్యాప్తంగా లాగిన్‌లో సమస్యలు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

