Tata Tiago EV | త్వరలో హ్యాచ్ బ్యాక్ ఈవీ టియాగో లాంచింగ్.. ధృవీకరించిన టాటా మోటార్స్
Tata Tiago EV | త్వరలో టియాగో ఈవీ కారు మార్కెట్లోకి తెస్తున్నట్లు టాటా మోటార్స్ ఎండీ శైలేష్ చంద్ర శుక్రవారం ప్రకటించారు.
Tata Tiago EV | కార్ల తయారీ.. అందునా ఎలక్ట్రిక్ కార్ల తయారీపై టాటా మోటార్స్ ( Tata Motors ) జోరు మీదుంది. ఇప్పటికే నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ అనే కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తన ఎంట్రీ లెవెల్ హ్యాచ్బ్యాక్ మోడల్ కారు టియాగో ఈవీ వర్షన్ వచ్చేనెలలో ఆవిష్కరిస్తామని ప్రకటించింది. ప్రపంచ విద్యుత్ వాహనాల దినోత్సవం సందర్భంగా టాటా మోటార్స్ ( Tata Motors ) ప్యాసింజర్ వెహికల్స్ ఎండీ శైలేష్ చంద్ర శుక్రవారం ఈ సంగతి వెల్లడించారు.
మార్కెట్లో వాటా పెంచుకునే విషయమై టాటా మోటార్స్ ఈవీ పోర్ట్ఫోలియో విస్తరణకు మూడు దశల వ్యూహాన్ని రూపొందించింది. వివిధ సెగ్మెంట్లు, బాడీ స్టైల్స్, చౌక ధర స్థాయిల్లో ఈవీ కార్లు ఆవిష్కరించనున్నది. టైగోర్ ఈవీ కంపాక్ట్ సెడాన్ కాగా, నెక్సాన్ ఈవీ ఒక కంపాక్ట్ ఎస్యూవీ మోడల్ కారు కాగా.. తాజాగా మార్కెట్లోకి రానున్న టియాగో ఈవీ హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లోకి వస్తుంది. టియాగో ఈవీ కారు ధర చౌకగా ఉంటుందని కూడా సంస్థ ప్రకటించింది.
వచ్చే ఐదేండ్లలో 10 ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి తీసుకొస్తామని టాటా మోటార్స్ ఇంతకుముందే ప్రకటించింది. ఈ పోర్ట్ఫోలియో విస్తరణలో భాగంగా టియాగో ఈవీ కారు తీసుకువస్తున్నామని శైలేష్ చంద్ర చెప్పారు. ప్రపంచ విద్యుత్ వాహనాల హబ్గా మార్చాలన్న విజన్ అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. త్వరలో టియాగో ఈవీ కారు ధర, స్పెసిఫికేషన్, ఫీచర్ల వివరాలను టాటా మోటార్స్ బయట పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వచ్చే ఎనిమిదేండ్లలో దేశంలో 30 శాతం వాహనాలు.. ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. కేంద్రం నిర్ణయానికి అనుగుణంగానే తమ సంస్థ విద్యుత్ కార్ల తయారీ కోసం ముందుకెళ్తుందని శైలేష్ చంద్ర తెలిపారు. ప్రస్తుతం దేశీయ రహదారులపై 40 వేల టాటా మోటార్స్ ఈవీ కార్లు పరుగులు తీస్తున్నాయని ఆ సంస్థ పేర్కొంది.
టియాగో ఈవీ కారు తయారీలోనూ జిప్ట్రాన్ టెక్నాలజీని వినియోగించనున్నది. ఇంతకుముందు కమర్షియల్ వెహికల్స్ సెగ్మెంట్లో టాటా మోటార్స్ జిప్ట్రాన్ టెక్నాలజీనే వాడింది. టైగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ వేరియంట్ కార్ల తయారీలోనూ జిప్ట్రాన్ టెక్నాలజీనే వినియోగించారు. ఇక టియాగో ఈవీలో వాడే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ను టైగోర్ ఈవీ మోడల్ నుంచి తీసుకొస్తారు. రోటరీ నాబ్తో తయారు చేసిన గేర్ లివర్ వాడతారు. ఇక టియాగో ఈవీ తయారీలో ఏ బ్యాటరీని టాటా మోటార్స్ వినియోగిస్తుందన్న సంగతి వెల్లడించలేదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

