e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home News Tata Punch | టాటా పంచ్ కారు వ‌చ్చేసింది.. ప్రారంభ ధ‌ర ఎంతంటే?

Tata Punch | టాటా పంచ్ కారు వ‌చ్చేసింది.. ప్రారంభ ధ‌ర ఎంతంటే?

న్యూఢిల్లీ: టాటా మోటార్స్ త‌న కొత్త మోడ‌ల్ టాటా పంచ్‌( Tata Punch )ను లాంచ్ చేసింది. మాన్యువ‌ల్‌, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్ష‌న్స్‌తోపాటు ఏడు రంగుల్లో ఈ పంచ్ కారు అందుబాటులోకి వ‌చ్చింది. దీని ధ‌ర‌ రూ.5.49 ల‌క్ష‌ల నుంచి రూ.9.09 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంది. మారుతి సుజుకి ఇగ్నిస్‌, రెనాల్ట్ కైగ‌ర్‌, నిసాన్ మాగ్నైట్‌, హ్యుండాయ్ కాస్ప‌ర్‌లాంటి కార్ల‌తో ఈ పంచ్ పోటీ ప‌డ‌నుంది. టాటా పంచ్ ఆ సంస్థ తీసుకొచ్చిన అతి చిన్న ఎస్‌యూవీ. భ‌ద్ర‌త విష‌యంలో ఈ కారుకు 5 స్టార్ రేటింగ్ వ‌చ్చింది.

రెండు ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్‌, ఫాగ్ ల్యాంప్‌, పారామెట్రిక్ అలారం వ్య‌వ‌స్థ‌, రివ‌ర్స్ పార్కింగ్ కెమెరా, డ్రైవ‌ర్‌, కో డ్రైవ‌ర్ సీట్‌బెల్ట్ రిమైండ‌ర్లు, టైర్ పంక్చ‌ర్ రిపేర్ కిట్‌లాంటి భ‌ద్ర‌తా ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో 7 అంగుళాల హార్మ‌న్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్ట‌మ్ అమ‌ర్చారు. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేల‌ను స‌పోర్ట్ చేస్తుంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement