రెనో నిస్సాన్‌తో టీ-హబ్ జట్టు
ఆటోమొబైల్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్న స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీ-హబ్, రెనో నిస్సాన్ చేతులు కలిపాయి. ఈ మేరకు టీ-హబ్‌లో రెనో నిస్సాన్ టెక్నాలజీ, బిజినెస్ సెంటర్ ఇండియా ఎండీ దేబాషిష్ నియోగి, సంస్థ ఉపాధ్యక్షుడు హిరోటెక్ హరడా, టీ-హబ్ సీఈవో ఎం శ్రీనివాసరావు, సీఐఈ సుజిత్ జాగీర్దార్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
- ఆటోమొబైల్ స్టార్టప్‌లను ప్రోత్సహించేలా ఒప్పందం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ఆటోమొబైల్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్న స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీ-హబ్, రెనో నిస్సాన్ చేతులు కలిపాయి. ఈ మేరకు టీ-హబ్‌లో రెనో నిస్సాన్ టెక్నాలజీ, బిజినెస్ సెంటర్ ఇండియా ఎండీ దేబాషిష్ నియోగి, సంస్థ ఉపాధ్యక్షుడు హిరోటెక్ హరడా, టీ-హబ్ సీఈవో ఎం శ్రీనివాసరావు, సీఐఈ సుజిత్ జాగీర్దార్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ‘టెక్నాలజీపరంగా సరికొత్త ఆవిష్కరణలను టీ-హబ్ కేంద్రంగా వందలాది స్టార్టప్‌లు చేస్తున్నాయి.
పరిశ్రమ ఆధారిత వినియోగం కోసం స్టార్టప్‌లతో కలిసి పనిచేసే కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాం’ అని ఈ సందర్భంగా శ్రీనివాసరావు తెలిపారు. దేబాషిష్ నియోగి మాట్లాడుతూ.. మొబిలిటీ మార్కెట్ నేడు ఎంతో కీలకంగా మారిందని, సరికొత్త ఆవిష్కరణల ద్వారా కంపెనీ కార్యకలాపాలు, ఉత్తత్తుల తయారీ మెరుగవుతుందనే ఆలోచనతోనే టీ-హబ్‌తో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు.
శాటిలైట్ కార్యాలయం
హైదరాబాద్‌లో కొత్తగా రెనో శాటిలైట్ కార్యాలయాన్ని ప్రారంభించింది. అద్భుతమైన ఆవిష్కరణలు జరుగుతుండటంవల్లే తెరిచామని దేబాషిష్ తెలిపారు. కాగా, ప్రస్తుతం ఇక్కడ 70మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ఏడాదిలో 200 మందిదాకా ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఐటీ నిపుణులను సంస్థ తీసుకోనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

