Adani Green Energy | అదానీ గ్రీన్ ఎనర్జీ డైరెక్టర్ సునీల్ మెహతా రాజీనామా.. ఇండస్ఇండ్ బ్యాంక్‌లో చేరిక!
Adani Green Energy | అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ మెహతా రాజీనామా చేశారు. ఆయన ఇండస్ఇండ్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమితులయ్యారు.
Adani Green Energy | హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికతో కుదేలైన అదానీ గ్రూప్ సంస్థలకు మరో షాక్ తగిలింది. అదానీ గ్రూప్ అనుబంధ అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) డైరెక్టర్‌గా సునీల్ మెహతా రాజీనామా చేశారు. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ చైర్మన్ పోస్ట్‌కు ఎంపికైనందుకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ (conflict of interest) వివాదం తలెత్తకుండా సునీల్ మెహతా తమ సంస్థ డైరెక్టర్ పోస్ట్‌కు రాజీనామా చేశారని అదానీ గ్రీన్ ఎనర్జీ శుక్రవారం స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
`ఇండస్ఇండ్ బ్యాంక్ పార్ట్‌టైం/ నాన్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులైన సునీల్ మెహతా.. ఆర్బీఐ అప్రూవల్‌ను అనుసరించి కంపెనీకి సమాచారం ఇచ్చారు. ఇండస్ఇండ్ బ్యాంక్‌కు, అదానీ గ్రీన్ ఎనర్జీకి మధ్య రుణ పరపతి సౌకర్యం అందుబాటులో ఉన్నది. ఈ నేపథ్యంలో ఇండస్ఇండ్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులైన సునీల్ మెహతాను వివాదాలకు దూరంగా ఉండాలని సూచించాం. ఆర్బీఐ సూచనకు అనుగుణంగా కంపెనీ నుంచి వైదొలగాలని సూచించాం` అని బీఎస్ఈ ఫైలింగ్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ తెలిపింది.
సునీల్ మెహతా తమ సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా రాజీనామా చేశారని, ఈ నెల 24 నుంచి అమల్లోకి వస్తుందని అదానీ గ్రీన్ ఎనర్జీ తెలిపింది. సునీల్ మెహతా సైతం తన రాజీనామాకు ఇతర కారణాలేవీ లేవని ధృవీకరించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

