Stock Market Close | నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. 73 పాయింట్లు పతనమైన సెన్సెక్స్..!
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్ల మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో దూసుకెళ్లాయి. ఆ తర్వాత సూచీలు పతనమయ్యాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 80,724.30 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది.
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్ల మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో దూసుకెళ్లాయి. ఆ తర్వాత సూచీలు పతనమయ్యాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 80,724.30 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. బడ్జెట్ ప్రారంభానికి ముందు అస్థిరతకు గురయ్యాయి. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం మొదలయ్యాక మళ్లీ లాభాలబాట పట్టాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 80,766.41 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేయగా.. ఒక దశలో 79,224.32 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. చివరకు 73.04 పాయింట్ల వద్ద నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ సైతం 30.20 పాయింట్ల నష్టంతో 24,479.05 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 1488 షేర్లు పురోగమించగా.. 1949 షేర్లు పతనమ్యాయి.
నిఫ్టీలో టైటాన్ కంపెనీ, టాటా కన్స్యూమర్, ఐటీసీ, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఎల్అండ్టీ, ఓఎన్జీసీ, హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ నష్టపోయాయి. సెక్టార్లలో ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్, మీడియా, ఐటీ సూచీలు 0.5-2.5 శాతం లాభపడ్డాయి. అయితే, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, రియాలిటీ 1-2 శాతం క్షీణించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం పతనం కాగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది. వ్యవసాయ రంగానికి రూ.1.52 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించగా.. వ్యవసాయ సంబంధిత స్టాక్‌లు 10శాతం పెరిగాయి. అదే సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రొయ్యల పెంపకం పథకాన్ని ప్రకటించిన తర్వాత, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్, అవంతి ఫీడ్స్, వాటర్‌బేస్ షేర్లు 8శాతం వరకు ఎగిశాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

