SBI hikes Home Loan Rates | ఎస్బీఐ హోంలోన్లు ఇక కాస్ట్లీ!
SBI hikes Home Loan Rates | ఆర్బీఐ రెపోరేట్‌కు అనుగుణంగా ఇండ్ల రుణాలపై ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ పెంచేసింది.
SBI hikes Home Loan Rates | ఇంటి రుణాలపై భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) కీలక వడ్డీరేట్లు పెంచేసింది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల ప్రభావాన్ని కట్టడి చేయడానికి ఆర్బీఐ ఇటీవల రెపోరేట్ 40 బేసిక్ పాయింట్లు పెంచేసిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా ఎస్బీఐ కూడా ఇండ్ల రుణాలపై ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్) 40 బేసిక్ పాయింట్లు పెంచుతున్నట్లు ఇటీవల ప్రకటించింది.
ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం సవరించిన ఈబీఎల్ఆర్ 7.5 శాతం, ఆర్ఎల్ఎల్ఆర్ 6.65 శాతం ప్లస్ సీఆర్పీగా నిర్ణయించారు. నూతన వడ్డీరేట్లు జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇంతకుముందు ఎస్బీఐ ఈబీఎల్ఆర్ 6.65 శాతం, రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్) 6.25 శాతంగా ఉండేది.
ఆర్బీఐ నిర్ణయానికి అనుగుణంగా ఎస్బీఐ 2019 జనవరి నుంచి రెపోరేట్ అనుసంధాన ఈబీఎల్ఆర్ను వినియోగిస్తున్నది. ఆర్బీఐ రెపోరేట్‌కు అనుగుణంగా ఎస్బీఐ ఈబీఎల్ఆర్ కూడా సవరిస్తారు. 2019 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రెపోరేట్తో ఇంటి రుణాలపై ఫ్లోటింగ్ ఇంటరెస్ట్ రేట్‌ను అనుసంధానించింది. ఎస్బీఐ మంజూరు చేసే ఇండ్లరుణాలపై వడ్డీరేట్లకు ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ వర్తింపచేస్తున్నారు.
ఎస్బీఐ ఇప్పటికే ఇండ్ల రుణాలపై మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)ను పది బేసిక్ పాయింట్లు పెంచేసింది. ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ రేట్లు ఈ నెల 15 నుంచి అమల్లోకి వచ్చాయి. మూడు నెలల గడువు రుణాలపై ఎంసీఎల్ఆర్ 6.85 శాతం, ఆరు నెలల గడువు గల రుణాలపై 7.15 శాతం, ఏడాది గడువు రుణాలపై 7.20 శాతం, రెండేండ్ల గడువు గల రుణాలపై 7.40 శాతం, మూడేండ్ల గడువు గల రుణాలపై 7.50 శాతంగా నిర్ణయించింది ఎస్బీఐ.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

