శంషాబాద్‌కు రద్దీలో నాల్గో స్థానం
విమాన ప్రయాణికుల రద్దీలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) దేశంలో నాల్గో స్థానంలో నిలిచింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): విమాన ప్రయాణికుల రద్దీలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) దేశంలో నాల్గో స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను విమాన ప్రయాణికుల సంఖ్యపరంగా దేశంలోని టాప్-10 విమానాశ్రయాల వివరాలను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. నిరుడు ఏప్రిల్ మొదలు ఈ ఏడాది మార్చి ఆఖరుదాకా మొత్తం 2,50,42,482 మంది దేశ, విదేశీ ప్రయాణికులకు ఆర్జీఐఏ సేవలందించినట్టు తెలిపింది.
అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే గణనీయంగా 19.3 శాతం వృద్ధిని సాధించింది. నాటి ప్రయాణికులు 2,09,96,027 గానే ఉన్నారు. ఈసారి 40 లక్షలకుపైగా ప్యాసింజర్లు పెరిగారు. ఇదిలావుంటే గత ఆర్థిక సంవత్సరం ప్రయాణికుల రద్దీలో మొదటి మూడు స్థానాల్లో ఉన్న విమానాశ్రయాల్లో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (7,36,73,708 మంది), ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (5, 28,20,754 మంది), బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (3,75,28,533 మంది) ఉన్నాయి. ఇక బేగంపేటలోని విమానాశ్రయం నుంచి ప్రయాణించిన వీవీఐపీ ప్యాసింజర్లు 2023-24లో 8,064 మందిగా ఉన్నారు. 2022- 23లో 1,938 మంది మాత్రమే ప్రయాణించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

