రెండోరోజూ లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు డిమాండ్ నెలకొనడం, విదేశీ నిధుల స్థిర ప్రవాహం, ముడిచమురు ధరలు తగ్గడంతో మంగళవారం స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 800 పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 427.40 పాయింట్లు అందుకొని 82,532.19 వద్ద ముగిసింది.
- సెన్సెక్స్‌కు 427 పాయింట్ల లాభం
ముంబై, నవంబర్ 17: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు డిమాండ్ నెలకొనడం, విదేశీ నిధుల స్థిర ప్రవాహం, ముడిచమురు ధరలు తగ్గడంతో మంగళవారం స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 800 పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 427.40 పాయింట్లు అందుకొని 82,532.19 వద్ద ముగిసింది.
మరో సూచీ నిఫ్టీ 96.30 పాయింట్లు ఎగబాకి 25,387.40 వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ, అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లతో దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు లాభపడ్డాయని దలాల్సీ్ర్టట్ వర్గాలు వెల్లడించాయి. సూచీల్లో యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, ఎస్బీఐ, టీసీఎస్, అదానీ పోర్ట్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. కానీ, హెచ్‌సీఎల్ టెక్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు పతనం చెందాయి.
రంగాలవారీగా పీఎస్‌యూ బ్యాంకింగ్ సూచీ అత్యధికంగా 2.06 శాతం లాభపడగా.. రియాల్టీ 1.86 శాతం, మిడ్‌స్మాల్ ప్రైవేట్ బ్యాంకింగ్ 1.37 శాతం, సర్వీసెస్ 1.24 శాతం, బ్యాంకెక్స్ 1.18 శాతం, హౌసింగ్ ఫైనాన్స్ 1.05 శాతం, ఆటో, ప్రైవేట్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు, టెలికమ్యూనికేషన్, ఐటీ, ఇండస్టియ్రల్స్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్, ఫోకస్డ్ ఐటీ, పవర్ రంగ సూచీలు వెనుకబడ్డాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

