Monthly Income Schemes | ఎస్బీఐ యాన్యుటీ.. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం.. ఏది బెస్ట్
Monthly Income Schemes | పెట్టుబడులతో నెలవారీ ఆదాయం కావాలంటే ఎస్బీఐ యాన్యుటీ స్కీం, పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీం ఉన్నాయి.
Monthly Income Schemes | ఇన్వెస్టర్లు రిస్క్‌లేకుండా ప్రతి నెలా నిర్దిష్టమైన ఆదాయం కోరుకుంటారు. అలా ఆదాయం వచ్చే నెలవారీ ఇన్‌కం ప్లాన్‌కే ఓటేస్తారు. అలా రిస్క్ తక్కువగా ఉన్న ఆదాయ మార్గాలంటే ఇన్వెస్టర్లు.. ప్రత్యేకించి సీనియర్ సిటిజన్లు.. రిటైర్డ్ ఉద్యోగులు ప్రాధాన్యం ఇస్తుంటారు. అటువంటి ప్లాన్లలో ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీం (SBI Annuity Deposit Scheme ), పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీం ( Post Office Monthly Income Scheme ) బెటర్.. ఇంకేం వాటి గురించి తెలుసుకుందామా..!
ఎస్బీఐ యాన్యూటీ డిపాజిట్ స్కీమ్
నెలవారీ ఆదాయం వచ్చే స్కీం.. ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీం. అయితే కస్టమర్లు ఒకేసారి మొత్తం (అసలు, వడ్డీ) పొందొచ్చు. ఈ స్కీం 36 నెలలు, 60 నెలలు, 84 నెలలు, 120 నెలల పీరియడ్‌తో మెచ్యూరిటీ వస్తుంది. పెద్దలతోపాటు మైనర్లు కూడా వ్యక్తిగతంగా గానీ, సంయుక్తంగా గానీ ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కామ్‌లో నిధులు పెట్టొచ్చు. గత నెల 14 నుంచి 36 నెలల నుంచి 120 నెలల మధ్య 5.45 నుంచి 5.50 శాతం వడ్డీ పొందొచ్చు. సీనియర్ సిటిజన్లకు 5.95-6.30 శాతం వడ్డీ లభిస్తుంది.
పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీం
పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీం (ఎంఐఎస్)లో ఒకరు గానీ, ముగ్గురు వ్యక్తులు గానీ చేరొచ్చు. కనీసం రూ.1000 నుంచి డిపాజిట్ చేయొచ్చు. ఒకరు విడిగా రూ.4.5 లక్షలు, సంయుక్తంగా రూ.9 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. వార్షికాదాయంపై 6.6 శాతం వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ పీరియడ్ ఐదేండ్ల వరకు ఉంటుంది. ఈ స్కీంపై వచ్చే ఆదాయం నెలవారీగా చెల్లిస్తారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

