SBI Home Loans | ఇండ్ల రుణాలపై ఎస్బీఐ ఆఫర్.. 50-100 శాతం వరకూ ప్రాసెసింగ్ ఫీజు.. వారికి వడ్డీరేట్లలో డిస్కౌంట్!
SBI Home Loans | వచ్చేనెలాఖరు వరకు ఇండ్ల రుణాలపై 50-100 శాతం ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. కొన్ని కేటగిరీల రుణాలపై వడ్డీరేట్లలో రాయితీలు కల్పిస్తోంది.
SBI Home Loans | ఇండ్ల రుణాలపై మరోమారు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన ఖాతాదారులకు రాయితీలు ప్రకటించింది. రెగ్యులర్ హోంలోన్, ఫ్లెక్స్ పే, ఎన్ఆర్ఐ, నాన్-శాలరీడ్, ప్రివిలైజ్, అపన్ ఘర్ కేటగిరీల వారికి 50-100 శాతం ప్రాసెసింగ్ ఫీజు మాఫీ, వడ్డీరేట్లపై రాయితీలు ప్రకటించింది. వచ్చేనెల 31 వరకు ప్రాసెసింగ్ ఫీజు, హోంలోన్లపై వడ్డీరేట్లలో రాయితీలు వర్తిస్తాయని శనివారం తెలిపింది.
హోంలోన్, టాప్ అప్ రుణాలపై 50 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు.. రూ.2000 వరకు కనిష్టంగా, గరిష్టంగా రూ.5000 రాయితీ లభిస్తుంది. వీటికి జీఎస్టీ వర్తిస్తుంది. టేకోవర్, రీసేల్, రెడీ టూ మూవ్ ఇండ్ల కొనుగోలు రుణాలకు 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తుంది. ఇన్‌స్టా టాప్ అప్, రివర్స్ మార్టగేజ్, ఈఎండీ (ఎర్నెస్ట్ డిపాజిట్ ఆఫ్ మనీ -Earnest Deposit of Money) కేటగిరీ రుణాలకు మాత్రం ప్రాసెసింగ్ ఫీజు మాఫీ ఉండదు.
సిబిల్ స్కోర్ ఆధారంగా..
సిబిల్ స్కోర్ 750-800, అంతకంటే ఎక్కువ గల వారికి 45 బేసిక్ పాయింట్లు వడ్డీరేటు తగ్గిస్తుంది. రాయితీ లేకుండా 9.15 శాతం వడ్డీ అమలవుతుండగా, రాయితీతో 8.70 శాతం వడ్డీపై రుణాలు లభిస్తాయి.
సిబిల్ స్కోర్ 700-749 పాయింట్ల మధ్య గల వారికి 55 బేసిక్ పాయింట్లు వడ్డీరేటు తగ్గుతుంది. రాయితీ లేకుండా 9.35 శాతం వడ్డీరేట్ వర్తిస్తే, రాయితీతో 8.80 శాతం వడ్డీ వసూలు చేస్తారు.
సిబిల్ స్కోర్ 650-699 పాయింట్ల మధ్య గల వారికి వడ్డీరేటులో ఎటువంటి రాయితీ ఉండదు. 9.45 శాతం వడ్డీ విధిస్తారు. 550-649 పాయింట్ల మధ్య సిబిల్ స్కోర్ గల వారికి 9.65 శాతం వడ్డీ వసూలు చేస్తారు.
హోంలోన్ టేకోవర్స్, రీసేల్, రెడీ టూ మూవ్ ప్రాపర్టీలపై (700, అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ గల వారికి) 20 బేసిక్ పాయింట్ల వడ్డీ రేటు రాయితీ
బిల్డర్ టైఅప్ ప్రాజెక్టులపై ఇండ్ల రుణాలకు అదనంగా ఐదు బేసిక్ పాయింట్ల వడ్డీ మినహాయింపు.
శౌర్య, శౌర్య ఫ్లెక్సీ ప్రొడక్టు రుణాలపై అదనంగా 10 బేసిక్ పాయింట్ల కన్సెషన్.. మహిళా రుణ గ్రహీతలకు మరో ఐదు బేసిక్ పాయింట్లు. వేతన ఖాతాల ప్రాతిపదికన ప్రివిలైజ్, అపన్ ఘర్ రుణాలు తీసుకున్న వారికి ఐదు బీపీఎస్ వడ్డీ డిస్కౌంట్ అందిస్తున్నది ఎస్బీఐ.
హోంలోన్ టేకోవర్స్, రీసేల్, రెడీ టూ మూవ్ ప్రాపర్టీస్, బిల్డర్ టై అప్ ప్రాజెక్ట్స్, శౌర్య అండ్ శౌర్య ఫ్లెక్సీ ప్రొడక్ట్ రుణాలపై గరిష్టంగా 20 బేసిక్ పాయింట్ల వడ్డీరాయితీ లభిస్తుందని ఎస్బీఐ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

