Rs 2000 Note | సగం రూ.2000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్.. రూ.1000 నోటు ముద్రించం తేల్చేసిన ఆర్బీఐ
Rs 2000 Note | మార్కెట్లో చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన రూ.2000 కరెన్సీ నోట్లలో దాదాపు సగం అంటే రూ.1.80 లక్షల కోట్ల విలువైన నగదు బ్యాంకుల్లో డిపాజిట్ అయిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
Rs 2000 Note | మార్కెట్లో చలామణిలోకి వచ్చిన రూ.2000 నోట్లలో రూ.1.80 లక్షల విలువైన నోట్లు వెనక్కి వచ్చేశాయి. బహిరంగ మార్కెట్ నుంచి 2000 నోటును ఉపసంహరిస్తున్నట్లు గత నెల 19న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కేవలం 15 రోజుల్లోనే సగం కరెన్సీ బ్యాంకులకు తిరిగి రావడం గమనార్హం.
గత మార్చి 31 నాటికి చలామణిలో రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఉన్నాయి. వాటిలో దాదాపు సగం నోట్లు (రూ.1.80 లక్షల కోట్లు) బ్యాంకింగ్ సిస్టమ్ లోకి వచ్చేశాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష (ఎంపీసీ) వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం మీడియాకు వెల్లడించారు. రూ.2000 నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఉన్నా.. ప్రస్తుత పరిస్థితి ప్రకారం బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ల రూపంలో 85 శాతం కరెన్సీ వెనక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
అలాగని చివరి క్షణం వరకూ రూ.2000 నోటు మార్పిడి లేదా డిపాజిట్ కోసం వేచి ఉండొద్దని పౌరులకు శక్తికాంత దాస్ తెలిపారు. నగదు మార్పిడికి ఆర్బీఐ వద్ద ఇతరత్రా కరెన్సీ ఉందన్నారు. మార్కెట్లో చలామణీ నుంచి రూ.500 నోట్లను ఉపసంహరించే ఆలోచనేదీ లేదన్నారు. తిరిగి రూ.1000 నోట్లు ముద్రించి చలామణిలోకి తెచ్చే ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పారు. ఇటువంటి ఊహాగానాలను వ్యాపింపజేయొద్దని పౌరులకు ఆర్బీఐ సూచించింది.
2016 నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రధాని నరేంద్రమోదీ పాత పెద్ద నోట్లు (రూ.1000, రూ.500) తక్షణం రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో 86 శాతం కరెన్సీని ఆర్బీఐ ఉపసంహరించినట్లయింది. దీంతో ప్రజానీకాన్ని ఇబ్బందుల నుంచి బయట పడవేసేందుకు రూ.2000 నోటును ఆర్బీఐ తీసుకొచ్చింది.
అలా చలామణిలోకి తెచ్చిన రూ.2000 నోటు 2018 మార్చి 31 నాటికి రూ.6.73 లక్షల కోట్లు ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే 2023 మార్చి నెలాఖరు నాటికి రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. గత నెల 23 నుంచి రూ.2000 బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం గానీ, దేశవ్యాప్తంగా 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో గానీ మార్పిడి చేసుకోవచ్చునని ఆర్బీఐ షరతు విధించింది.
ఒకరోజు నగదు మార్పిడికి రూ.20 వేలకు మాత్రమే పరిమితం చేసిన ఆర్బీఐ.. ఖాతాల్లో డిపాజిట్లకు ఎటువంటి షరతులు విధించలేదు. ఇప్పటికీ చలామణిలో ఉన్న రూ.2000 నోటు ఆర్థిక లావాదేవీలకు వాడవచ్చునని ఆర్బీఐ తెలిపింది. కానీ, ఖాతాదారులకు రూ.2000 నోటు ఇవ్వవద్దని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
READ MORE :
RBI Monetary Policy | రుణగ్రహీతలకు ఉపశమనం.. వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
RBI Monetary Policy | రూ. 500 నోట్లపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

