ఆర్ధిక మాంద్యం ఆందోళన : 23 శాతం ఉద్యోగులపై రాబిన్‌హుడ్ వేటు
ఆర్ధిక సంక్షోభం ముంచుకొస్తుందనే భయంతో పలు కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్న క్రమంలో తాజాగా రాబిన్‌హుడ్ కంపెనీ ఉద్యోగుల మాస్ లేఆఫ్స్‌కు సంసిద్ధమైంది.
న్యూఢిల్లీ : ఆర్ధిక సంక్షోభం ముంచుకొస్తుందనే భయంతో పలు కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్న క్రమంలో తాజాగా రాబిన్‌హుడ్ కంపెనీ ఉద్యోగుల మాస్ లేఆఫ్స్‌కు సంసిద్ధమైంది. తమ సిబ్బందిలో 23 శాతం మందిని తొలగిస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాబిన్‌హుడ్ తన ఉద్యోగుల్లో 9 శాతం మందిపై వేటు వేసింది.
రికార్డుస్ధాయిలో ద్రవ్యోల్బణంతో పాటు క్రిప్టో మార్కెట్ కుంగుబాటుతో ఉద్యోగులను తొలగించకతప్పడం లేదని కంపెనీ సీఈఓ వ్లాద్ టెనెవ్ చెప్పుకొచ్చారు. కంపెనీ ఆపరేషన్స్, మార్కెటింగ్, ప్రోగ్రాం మేనేజ్మెంట్ విభాగాల్లో ఉద్యోగులను తొలగిస్తున్నామని తెలిపారు. రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్స్, క్రిప్టో ఆస్తుల్లో ట్రేడింగ్ కొనసాగిస్తారనే అంచనాతో 2021లో రికార్డు స్ధాయిలో నియామకాలు చేపట్టామని రాబిన్‌హుడ్ సీఈఓ వివరించారు.
సిబ్బందిపై వేటు తప్పదని కంపెనీ ఇప్పటికే ఉద్యోగులకు ఈమెయిల్ పంపింది. వేటు పడిన ఉద్యోగులు అక్టోబర్ 1 వరకూ కంపెనీలో కొనసాగవచ్చని సంకేతాలు పంపారు. ఇక సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కూడా పలువురు ఉద్యోగులను సాగనంపనుంది. కొందరు ఉద్యోగుల సామర్ధ్యం, పనితీరుపై సీఈఓ సుందర్ పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు నైపుణ్యాలను, పనితీరును మెరుగుపరుచుకోవాలని ఉద్యోగులను ఆయన ఇటీవల హెచ్చరించారు. గూగుల్ సహా పలు టెక్ కంపెనీలు సైతం ఉద్యోగుల తొలగింపు ప్రక్రియపై కసరత్తు సాగిస్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

