హైదరాబాద్, సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ): స్టార్టప్ ఇంక్యుబేటర్ టీహబ్‌ను జర్మనీకి చెందిన ఇన్ఫినియాన్ కంపెనీ ప్రతినిధులు మంగళవారం సందర్శించారు. సెమికండక్టర్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కంపెనీ ప్రతినిధులు నగరంలోని స్టార్టప్ ఎకో సిస్టంను ప్రత్యేకంగా పరిశీలించారు.
ఈ సందర్బంగా టీహబ్ నిర్వాహకులు జర్మనీ ప్రతినిధులతో స్టార్టప్‌లకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను, సరికొత్త ఆవిష్కరణ చేసేందుకు చేపట్టిన చర్యలను వారికి వివరించారు. సెమికండక్టర్ రంగంలో పెట్టుబడులకు ఎంతో అనుకూలమని, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పరిశ్రమల ప్రోత్సాహకాలపైన వారితో చర్చించారు.