Inflation effect | ఇప్పట్లో వడ్డీరేట్లు తగ్గవు.. 2024 మార్చి తర్వాతే అంటున్న విశ్లేషకులు
ఆహార ఉత్పత్తుల ధరలు కొద్దినెలల్లో తగ్గిపోతాయని అంచనా వేస్తున్న ఆర్బీఐ వచ్చే అక్టోబర్ 6-8 సమీక్షలో ద్రవ్యోల్బణం అంచనాల్ని సవరిస్తుంది. ధరలు బాగా తగ్గినట్లయితే వడ్డీ రేట్లలో సైతం కోత పెడుతుందన్న ఆశలు సహజం. అయితే ద్రవ్యోల్బణంపై తమ పోరును ఆపబోమని, ధరల అదుపునకు చేపట్టిన చర్యల్ని ఇప్పట్లో వెనక్కు తీసుకోబోమని శక్తికాంత్ దాస్ కుండబద్దలు కొట్టారు.
Inflation effect | ముంబై, ఆగస్టు 10: ఆహార ఉత్పత్తుల ధరలు కొద్దినెలల్లో తగ్గిపోతాయని అంచనా వేస్తున్న ఆర్బీఐ వచ్చే అక్టోబర్ 6-8 సమీక్షలో ద్రవ్యోల్బణం అంచనాల్ని సవరిస్తుంది. ధరలు బాగా తగ్గినట్లయితే వడ్డీ రేట్లలో సైతం కోత పెడుతుందన్న ఆశలు సహజం. అయితే ద్రవ్యోల్బణంపై తమ పోరును ఆపబోమని, ధరల అదుపునకు చేపట్టిన చర్యల్ని ఇప్పట్లో వెనక్కు తీసుకోబోమని శక్తికాంత్ దాస్ కుండబద్దలు కొట్టారు.
వడ్డీ రేట్లు గరిష్ఠస్థాయిలోనే దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. దాస్ మాటల్ని పరిగణనలోకి తీసుకున్న విశ్లేషకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేట్లు తగ్గబోవన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నందున ఈ ఏడాది రేట్ల కోతకు అవకాశం లేదని, 2024 మార్చి తర్వాతే రేట్లు తగ్గవచ్చని ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ మర్జ్‌బాన్ ఇరానీ అన్నారు. తాజాగా ఆర్బీఐ ద్రవ్యోల్బణం అంచనాల్ని పెంచినందున, 2024 క్యాలండర్ సంవత్సరం ప్రధమార్థంలో కూడా రేట్ల కోత ఛాన్స్ తక్కువేనని ఆనంద్‌రాఠి షేర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుజన్ హజ్రా చెప్పారు. పైగా మరో దఫా రేట్లను పెంచే అవకాశం ఉన్నదని అరిహంత్ క్యాపిటల్ డైరెక్టర్ అనితా గాంధి అంచనా వేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

