Rs.2000 | రూ.2000 నోట్లు ఇలా కూడా మార్చుకోవచ్చు.. తేల్చి చెప్పిన ఆర్బీఐ..!
Rs.2000 | గతేడాది మేలో మార్కెట్లో చలామణి నుంచి ఉపసంహరించిన రూ.2000 నోట్లను ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాలతోపాటు దేశంలోని పోస్టాఫీసుల వద్ద కూడా మార్చుకోవచ్చు.
గతేడాది మేలో రద్దు చేసిన రూ.2000 విలువైన నోట్ల మార్పిడి కోసం పౌరులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మరో అవకాశం కల్పించింది. పోస్టాఫీసుల వద్ద కూడా రూ.2000 విలువైన నోట్లు మార్చుకోవచ్చునని తెలిపింది. దేశంలోని ఆర్బీఐ కార్యాలయాల వద్ద పౌరులు రూ.2000 విలువైన నోట్ల మార్పిడికి బారులు తీరారన్న వార్తలు రావడంతో కేంద్ర బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నది. దేశంలోని ఏదైనీ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం, పోస్టాఫీసు వద్ద రూ.2000 నోట్లను మార్చుకోవచ్చునని శుక్రవారం తెలిపింది.
అయితే రూ.2000 నోట్లు మార్చుకునే పౌరులు ప్రస్తుతం ఆన్లైన్లో లభిస్తున్న దరఖాస్తు ఫామ్ నింపి.. పోస్టాఫీసు ద్వారా ఆర్బీఐకి పంపవచ్చునని ఆర్బీఐ తెలిపింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా గతేడాది మే నెలలో రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు కేంద్రీయ బ్యాంక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పాత పెద్ద నోట్లు (రూ.1000, రూ.500) రద్దు చేసినప్పుడు 2016లో తొలిసారి రూ.2000 నోటును కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఆర్బీఐ విడుదల చేసింది. రూ.2000 నోట్ల జీవిత కాలం ముగిసిందని, లావాదేవీల కోసం వాటిని ప్రజలు వాడనందున వాటిని ఉపసంహరిస్తున్నట్లు తెలిపింది.
గత మే నెల నాటికి చలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 97.38 శాతానికి పైగా కరెన్సీ తమ వద్దకు తిరిగి వచ్చిందని ఆర్బీఐ తెలిపింది. చలామణి నుంచి ఉపసంహరించిన రూ.2000 నోట్ల మార్పిడికి, డిపాజిట్లకు దేశంలోని అన్ని బ్యాంకుల కౌంటర్లు, పలు చానళ్లను ఏర్పాటు చేసింది. ఏ వ్యక్తి అయినా సరే ప్రతి రోజూ ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాల వద్ద గానీ, పోస్టాఫీసుల వద్ద గానీ రూ.20 వేల లోపు విలువ గల రూ.2000 నోట్ల మార్పిడికి అనుమతి ఇచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

