Morgan Stanley on RBI | మళ్లీ 0.50 శాతం రెపోరేట్ పెంపు.. ఆహార ధరలు పైపైకి
Morgan Stanley on RBI | ఈ నెలాఖరులో ఆర్బీఐ మరో 0.5 శాతం రెపోరేట్ పెంచొచ్చునని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది.
Morgan Stanley on RBI | ఈ నెలాఖరులో జరిగే ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్బీఐ మరోమారు రెపోరేట్ 50 బేసిక్ పాయింట్లు పెంచనున్నదా.. అవుననే అంటున్నది అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ. దీంతో ఆర్బీఐ రెపోరేట్ 5.9 శాతానికి పెరుగుతుందని, ఒకవేళ యథాతథ స్థితిని కొనసాగించినా కొనసాగించొచ్చునని పేర్కొంది. 35 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచుతుందని ఇంతకుముందు అంచనా వేశాం.. ద్రవ్యోల్బణం వరుసగా ఎనిమిదో నెలలో సౌలభ్య స్థాయి కంటే ఎక్కువ స్థాయిలోనే కొనసాగుతున్నందున ఆర్బీఐ రెపోరేట్ పెంచుతుందని అంచనా వేస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ తెలిపింది.
ఆహార వస్తువుల ధరల పెరుగుదలతో సెప్టెంబర్‌లోనూ రిటైల్ ద్రవ్యోల్బణం 7.1-7.4 శాతం మధ్య కొనసాగుతుందని భావిస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. 2023 జనవరి/ ఫిబ్రవరి వరకు ద్రవ్యోల్బణం ఆరు శాతానికి పైగా నమోదవుతుందని, ఆ తర్వాత కాస్త తగ్గొచ్చునని తెలిపింది. అంతర్జాతీయంగా కమొడిటీల ధరల్లో మార్పులు, డాలర్ బలోపేతం కావడం.. తత్ఫలితంగా ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువలో బలహీనపడితే ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని స్పష్టం చేసింది.
ఆర్బీఐ రెపోరేట్ పెంచినప్పటి నుంచి వ్యవస్థలో ద్రవ్య లభ్యత తగ్గుముఖం పట్టిందని మోర్గాన్ స్టాన్లీ వివరించింది. జనవరిలో 89 బిలియన్ డాలర్ల నిల్వలు ఉంటే, అది ఇప్పుడు 19.1 బిలియన్ డాలర్లకు పడిపోయింది. మే నుంచి మూడుసార్లు ఆర్బీఐ 140 బేసిక్ పాయింట్ల రెపోరేట్ పెంచేసిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

