Byjus | 4,800 కోట్ల నుంచి సున్నాకు.. బైజూస్‌లో పెట్టుబడులను రైటాఫ్ చేసిన ప్రోసస్
డచ్‌కి చెందిన పెట్టుబడుల సంస్థ ప్రోసస్ నిండామునిగింది. బైజూస్‌లో పెట్టిన 578 మిలియన్ డాలర్ల(రూ.4,800 కోట్ల) పెట్టుబడులను రైటాఫ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Byjus | న్యూఢిల్లీ, జూన్ 24: డచ్‌కి చెందిన పెట్టుబడుల సంస్థ ప్రోసస్ నిండామునిగింది. బైజూస్‌లో పెట్టిన 578 మిలియన్ డాలర్ల(రూ.4,800 కోట్ల) పెట్టుబడులను రైటాఫ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎడ్యుటెక్ సంస్థ బైజూస్‌లో గతంలో 9.6 శాతం వాటా కలిగివున్నది. ప్రస్తుతం ఈ వాటాను సాంకేతికంగా రద్దు చేసుకుంటున్నట్లు తెలిపింది. దీంతో సంస్థకు రూ.4,800 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. ఈ విషయాన్ని నెదర్లాండ్ స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం అందించింది.
బైజూస్‌లో ఈక్విటీ ఇన్వెస్టర్ల వాటాల విలువ భారీగా క్షీణించిన నేపథ్యంలో రైటాఫ్ నిర్ణయం తీసుకున్నామని ప్రోసస్ వెల్లడించింది. దీంతో 2024 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 493 మిలియన్ డాలర్ల నష్టం వాటిళ్లింది. రైట్స్ ఇష్యూకి ముందు బైజూస్‌లో 9.6 శాతం వాటా ఉందని పేర్కొంది. కంపెనీ ఆర్థిక పరిస్థితులు, అప్పులు, భవిష్యత్తు అంచనాలకు తమవద్ద ఎలాంటి సమాచారం లేకపోవడంతో బైజూస్ కంపెనీ విలువను సున్నాకు తగ్గిస్తున్నట్లు ప్రోసస్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

