Post Office Savings | గ్యారంటీ రిటర్న్స్ సేవింగ్స్.. పోస్టాఫీసు టైం డిపాజిట్.. ఇవీ బెనిఫిట్లు!
Post Office Savings | బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల మాదిరే గ్యారంటీ రిటర్న్స్ ఇచ్చే స్కీం పోస్టాఫీసు టైం డిపాజిట్ స్కీం పాపులర్.
Post Office Savings | చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పోస్టాఫీసు స్కీమ్‌లు చాలా పాపులర్.. వాటిల్లోనే పోస్టాఫీస్ టైం డిపాజిట్ (పీవోటీడీ) స్కీం అత్యంత పాపులర్. బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను పోలి ఉన్నందునే దీన్ని పోస్టాఫీసు టైం డిపాజిట్ స్కీం అని పిలుస్తారు. గ్యారంటీ రిటర్న్స్ లభించే స్కీం ఇది. కనుక ఈ స్కీం ఇన్వెస్టర్లకు సురక్షితమైన పొదుపు పథకం. ఈ పథకం కింద నిర్దిష్ట గడువుతో ఖాతా తెరువొచ్చు. ఖాతాదారుడి చాయిస్‌ను బట్టి 12 నెలలు, రెండేండ్లు, మూడేండ్లు, ఐదేండ్ల గడువుతో ఈ టైం డిపాజిట్ స్కీంలో ఖాతా తెరవచ్చు.
పోస్టాఫీసు టైం డిపాజిట్ పథకం ఖాతాలో వయోజనులు ఒంటరిగా గానీ, ముగ్గురు వ్యక్తులు జాయింట్ ఖాతా గానీ తెరవొచ్చు. పదేండ్లు దాటిన మైనర్లు కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పదేండ్లు, అంతకంటే తక్కువ వయస్సు గల మైనర్లైతే మాత్రం.. వారి తరఫున తల్లిదండ్రులుగానీ, గార్డియన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మైనర్లు మేజర్లయిన తర్వాత సొంతంగా ఆ ఖాతాలు నిర్వహించొచ్చు. ఈ పథకం కింద ఎన్ని ఖాతాలైన తెరవొచ్చు. ఇక భారత్‌లో నివసించని వారు ఈ ఖాతా తెరవడానికి అనర్హులు. క్యాష్ చెల్లించి గానీ, చెక్‌తో గానీ ఈ పథకంలో డిపాజిట్ చేయొచ్చు.
పోస్టాఫీసు టైం డిపాజిట్ ఖాతా కింద కనీసం రూ.1000తో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. డిపాజిట్ చేయడానికి గరిష్ట పరిమితి లేదు. ఏడాది నుంచి మూడేండ్ల గడువు గల డిపాజిట్లకు 5.5 శాతం, ఐదేండ్ల లోపు డిపాజిట్లకు 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. మూడు నెలలకోసారి వడ్డీరేటు ఖరారు చేస్తారు. ఏడాదికోసారి వడ్డీ చెల్లిస్తారు. డిపాజిట్, మిగతా మొత్తం.. ఖాతా మెచ్యూరిటీ తేదీ తర్వాత చెల్లిస్తారు.
ఐదేండ్ల గడువు గల (లాకిన్ పీరియడ్) డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం మీద ఆదాయం పన్ను చట్టం-1961లోని 80సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. మెచ్యూరిటీ తేదీ తర్వాత డిపాజిట్ పొడిగించే రిక్వెస్ట్‌ను.. అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే సమర్పించారు. ఏడాది గడువు గల ఖాతాను మెచ్యూరిటీ తర్వాత ఆరు నెలల్లోపు పొడిగించొచ్చు. రెండేండ్ల గడువు గల డిపాజిట్లను 12 నెలల్లోపు, మూడు నుంచి ఐదేండ్ల లోపు డిపాజిట్లు 18 నెలల్లోపు పొడిగించొచ్చు. ఒక వ్యక్తి తన డిపాజిట్ పథకాన్ని ఒక పోస్టాఫీసు బ్రాంచ్ నుంచి మరో పోస్టాఫీసు బ్రాంచ్‌కు బదిలీ చేసుకోవచ్చు.
డిపాజిట్ చేసిన తేదీ నుంచి ఆరు నెలల తర్వాతే విత్‌డ్రా చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన ఆరు నెలల నుంచి ఏడాది లోపు విత్ డ్రా చేసుకుంటే సేవింగ్స్ అకౌంట్ల డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ మాత్రమే లభిస్తుంది. ఏడాది తర్వాత విత్ డ్రా చేస్తే పొదుపు ఖాతాపై వడ్డీ కంటే ఒకశాతం ఎక్కువ పే చేస్తారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

