హైదరాబాద్, నవంబర్ 22: పతంజలి గ్రూప్ పరిశోధనాత్మక ఆయుర్వేద ఔషధం ‘కొరొనిల్’.. ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘జర్నల్ ఆఫ్ సపరేషన్ సైన్స్’ కవర్ పేజీపై చోటు దక్కించుకున్నది. ఆయుర్వేదం చరిత్రలోనే ఇది తొలిసారి అని పతంజలి పేర్కొన్నది. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో కోట్లాది మంది ప్రజల ప్రాణాల్ని ఈ ఔషధం కాపాడిందని సంస్థ వెల్లడించింది. అత్యంత అడ్వాన్స్డ్, ఇన్-డెప్త్ సైంటిఫిక్ రిసెర్చ్తో వచ్చిన ఏకైక ఆయుర్వేద ఔషధం కొరొనిల్ మాత్రమేనని తెలిపింది.