Oppo K12x 5G | ఒప్పో నుంచి ఎంట్రీ లెవల్ ఫోన్ ఒప్పో కే12ఎక్స్ 5జీ.. ఇవీ డీటెయిల్స్..!
Oppo K12x 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) ఫోన్ ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Oppo K12x 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) ఫోన్ ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తోపాటు 8 జీబీ ర్యామ్ తోనూ వస్తోంది. తొలిసారి మిలిటరీ గ్రేడ్ ఎంఐఎల్-ఎస్టీడీ 810హెచ్ సర్టిఫికేషన్ ఉంటుంది. 360-డిగ్రీ డామేజ్ ప్రూఫ్ ఆర్మౌర్ బాడీగా అందుబాటులో ఉంటది. తడి చేతులతో ఫోన్ వాడుతున్నప్పుడు స్ప్లాష్ టెక్నాలజీకి మద్దతు ఉంటుంది.
ఒప్పో కే12ఎక్స్ 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,999, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.15,999 పలుకుతుంది. ఆగస్టు రెండో తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్, ఒప్పో ఇండియా ఈ-స్టోర్ ద్వారా సేల్స్ ప్రారంభం అవుతాయి. సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ.1000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా మూడు నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందిస్తారు. అయితే ఆగస్టు రెండో తేదీ వరకూ కొనుగోలు చేసే వారికి ఈ ఆఫర్లు వర్తిస్తాయి. బ్రీజ్ బ్లూ, మిడ్ నైట్ వయోలెట్ రంగుల్లో లభిస్తుందీ స్మార్ట్ ఫోన్.
ఒప్పో కే12ఎక్స్ 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, డ్యుయల్ రీఇన్ ఫోర్స్డ్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. చేతులు తడిగా ఉన్నప్పుడు ఫోన్లు పని చేయడానికి స్ప్లాష్ టెక్నాలజీతో వస్తోంది. 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీతో అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ ఓఎస్ 14 వర్షన్ పై పనిచేస్తుందీ ఫోన్.
ఒప్పో కే12ఎక్స్ 5జీ ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ – 32 మెగా పిక్సెల్స్ సెన్సర్ మెయిన్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 5జీ, 4జీ వోల్ట్, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్బీ టైప్-సీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ, బయో మెట్రిక్ అథంటిక్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

