Oppo F23 Pro 5G | భారత్ మార్కెట్లోకి 15న ఒప్పో ఎఫ్23 ప్రో.. ధరెంతంటే..?!
Oppo F23 Pro 5G | ఒప్పో ఎఫ్23 ప్రో 5జీ ఫోన్ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15న భారత్ మార్కెట్లోకి రానున్నది.
Oppo F23 Pro 5G | ప్రముఖ చైనా టెక్ కంపెనీ ఒప్పో.. తన ‘ఒప్పో ఎఫ్23 ప్రో 5జీ (Oppo F23 Pro 5G) ఫోన్‌ను ఈ నెల 15న భారత్ మార్కెట్లో విడుదల చేయనున్నది. ఒప్పో యాజమాన్యం తన వెబ్సైట్లో టీజర్ ద్వారా ఈ సంగతి తెలిపింది. ఆవిష్కరణ తేదీతోపాటు ఈ ఫోన్లో వాడే ఫీచర్లు, స్మార్ట్ ఫోన్ ధర వివరాలు బయట పెట్టింది. ఒప్పో ఎఫ్23 ప్రో 5జీ ఫోన్ ధర రూ.24,999గా నిర్ణయించింది. సింగిల్ వేరియంట్ 8జీబీ రామ్ విత్ 256 రామ్ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా వస్తున్నది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ 67 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ప్రాసెసర్, హార్డ్‌వేర్, సాఫ్ట్ వేర్, కెమెరా తదితర వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. కానీ, మీడియాలో స్పెషిఫికేషన్లు, ఫీచర్లు, హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ వివరాలు వెల్లడయ్యాయి.
ఇవీ ఒప్పో ఎఫ్23 ప్రో 5జీ స్పెషిఫికేషన్స్..
డిస్ ప్లే : ఒప్పో ఎఫ్23 ప్రో 5జీ (Oppo F23 Pro 5G) ఫోన్ 6.72-అంగుళాల ఫుల్ హెచ్డీ + డిస్ ప్లే విత్ 120హెర్జ్స్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. దీని రిజొల్యూషన్ రేటు 2400×1080 పిక్సెల్స్ విత్ 580 నిట్స్ బ్రైట్ నెస్ ఉంటుంది.
హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్వేర్: పనితీరు కోసం క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పని చేస్తుంది. 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ తో మార్కెట్లోకి వస్తున్నది.
కెమెరా: ఫొటో గ్రఫీ కోసం ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 64-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగా పిక్సెల్స్ మొనో క్రోమ్, 2- మెగా పిక్సెల్ మైక్రో లెన్స్ కమెరా, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32 మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా విత్ పంచ్ హోల్ డిజైన్‌తో వస్తుందని భావిస్తున్నారు.
బ్యాటరీ అండ్ చార్జింగ్: పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 67 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నదని ఒప్పో కూడా కన్ఫర్మ్ చేసింది.
కనెక్టివిటీ : 5జీ, 4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, యూఎస్బీ టైప్ సీ ఫర్ చార్జింగ్, ఆడియో జాక్ విత్ ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

