హైదరాబాద్, మే 5: ఒలెక్ట్రా గ్రీన్టెక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ. 27.01 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది రూ.17.77 కోట్ల లాభంతో పోలిస్తే 52 శాతం వృద్ధి నమోదైంది.
ఏడాది క్రితం రూ.271.3 కోట్లుగా ఉన్న కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం గత త్రైమాసికానికిగాను 39 శాతం ఎగబాకి రూ.375.91 కోట్లకు చేరుకున్నట్టు ఒలెక్ట్రా గ్రీన్టెక్ సీఎండీ కేవీ ప్రదీప్ తెలిపారు. 2022-23లో రూ.1,090. 76 కోట్ల ఆదాయంపై రూ.65.59 కోట్ల లాభాన్ని గడించింది.