Ola e-scooter launch | విపణిలోకి ఓలా స్కూటర్.. రెండు వేరియంట్లలో లభ్యం
Ola e-scooter launch | ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎట్టకేలకు విపణిలో అడుగు పెట్టింది. ఎస్1, ఎస్1 ప్రో మోడళ్లలో వినియోగదారులకు అందుబాటులోకి ....

Ola e-scooter launch | ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎట్టకేలకు విపణిలో అడుగు పెట్టింది. ఎస్1, ఎస్1 ప్రో మోడళ్లలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. ఆదివారం విపణిలో ఆవిష్కరించిన ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ ఆ స్కూటర్ వేరియంట్ల ధరలు వెల్లడించారు. ఎస్ 1 మోడల్ స్కూటర్ ధర రూ.99,999, ఎస్ వన్ ప్రో స్కూటర్ ధర రూ.1,29,999 వద్ద ప్రారంభం అవుతుంది.
దేశ రాజధాని ఢిల్లీ, గుజరాత్‌తోపాటు మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో సబ్సిడీపై లభిస్తుంది. వచ్చే నెల ఎనిమిదో తేదీ నుంచి సేల్స్ మొదలవనున్నాయి. అక్టోబర్ నుంచి ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి కంపెనీ పంపిణీ ప్రారంభించనున్నది.
ఓలా స్కూటర్ లాంచింగ్ ఇలా..
ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీష్ అగర్వాల్ చాలా ఆసక్తికరంగా స్కూటర్ ఆవిష్కరించారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని సంస్థ ప్లాంట్ రూఫ్‌పై నిలబడి ప్రారంభించారు. ముందుగా భూమాత గొప్పతనమేమిటో ప్రస్తావించారు. పర్యావరణాన్ని కాలుష్యం దెబ్బ తీస్తున్న తీరును వివరించారు. దేశవ్యాప్తంగా వాహనాలు ఏటా 12 వేల కోట్ల లీటర్ల ఇంధనాన్ని వాడుతున్నాయి. దేశంలోని మొత్తం కాలుష్యంలో వాహనాల వాటా 40 శాతం అని భవిష్ అగర్వాల్ తెలిపారు.

8.5 కిలోవాట్ల పీక్ పవర్ ఉత్పత్తి సామర్థ్యం గల మోటార్
ఎస్1 స్కూటర్లో 8.5 కిలోవాట్ల పీక్ పవర్ ఉత్పత్తి సామర్థ్యం గల మోటార్ ఇన్స్టాల్ చేశారు. దీనికి 3.9 కిలోవాట్ల సామర్థ్యం గల బ్యాటరీని అనుసంధానించారు. కేవలం మూడు సెకన్లలో 40 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది. గరిష్ఠంగా 115 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి చార్జి చేస్తే 181 కి.మీ. వరకు ప్రయాణించొచ్చు. ఇది నార్మల్, స్పోర్ట్, హైపర్ మోడ్ల్లో లభ్యం అవుతుంది.
ఎస్1 స్కూటర్‌తోపాటు కస్టమర్‌కు కంపెనీ 750 వాట్ల పోర్టబుల్ చార్జర్ అందజేస్తుంది. దీని సాయంతో ఆరు గంటల్లో బ్యాటరీని చార్జీ చేసుకోవచ్చు. ఓలా హైపర్ స్టేషన్లో 18 నిమిషాల్లోనే 50 శాతం చార్జి అవుతుంది.
ఓలా స్కూటర్లో రివర్స్ మోడ్
ఓలా స్కూటర్లో రివర్స్ మోడ్ కూడా ఉంది. దీనివల్ల పార్కింగ్ పాయింట్లో తేలిగ్గా పార్క్ చేయొచ్చు. ఎత్తు ప్రదేశానికి వెళ్లిన తర్వాత స్కూటర్ ఆపివేసినా మోటార్ సిద్ధంగా ఉంటుంది. స్పీడ్ పెంచాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ అండ్ రేర్ ప్రాంతాల్లో డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ముందుబాగాన మోనోషాకర్స్ కూడా ఉంటాయి.

ఏడంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో ఆపరేటింగ్ సిస్టమ్ నడుపొచ్చు. డిస్ప్లే చాలా షార్ప్‌గా, బ్రైట్‌గా ఉంటుంది. ఇది వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్‌గా ఉంటుంది. 3జీబీ రామ్‌తోపాటు ఓక్టాకోర్ ప్రాసెసర్, ఒక చిప్ కూడా అమర్చారు. ఇది 4జీ వై-ఫై, బ్లూటూత్లకు మద్దతుగా పని చేస్తుంది.
యాప్, స్కూటర్ స్క్రీన్ ఆధారంగా లాక్-అన్‌లాక్
ఓలా స్కూటర్లో మరో ప్రత్యేకత ఏమిటంటే దానికి తాళాలు ఉండవ్. స్మార్ట్ ఫోన్లో యాప్, స్కూటర్ స్క్రీన్ ఆధారంగా లాక్-అన్‌లాక్ ప్రక్రియ చేపట్టవచ్చు. ఈ స్కూటర్లో అమర్చిన సెన్సర్ల వల్ల ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు మీ పేరు చెబుతూ బై చెబుతుంది.
స్కూటర్ స్పీడో మీటర్ కూడా మార్చుకోవచ్చు. స్కూటర్ డిస్ప్లేపై స్పీడో మీటర్ కనిపిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా స్పీడ్‌ను సెట్ చేయొచ్చు. మీ కుటుంబ సభ్యులను బట్టి ముందే ఈ స్కూటర్ స్పీడ్ సెట్ చేయొచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

