NPS Rules | ఎన్పీఎస్ నుంచి 60 శాతం పెట్టుబడులు విత్డ్రా చేసుకోవచ్చు.. అందుకు ఏం చేయాలంటే..?!
NPS Rules | నేషనల్ పెన్షన స్కీం (ఎన్పీఎస్)లో పెట్టుబడులు పెట్టిన వారు నిధులు ఉపసంహరించుకోవడానికి నిబంధనల్లో మార్పులు చేశారు. ప్రభుత్వోద్యోగులు, కార్పొరేట్ ఉద్యోగులు రిటైరైతే 60 శాతం వరకూ విత్ డ్రా చేసుకోవచ్చు.
NPS rules | రిటైరయిన తర్వాత వారికి ఆర్థిక భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) తెచ్చింది. పన్ను ఆదా చేయడానికి ఇది ఒక బెటర్ రిటైర్మెంట్ ఫండ్ అని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా మంచి రిటర్న్స్ ఇచ్చే పొదుపు స్కీంగానూ పని చేస్తుంది. మిగతా రిటైర్మెంట్ ఫండ్స్తో పోలిస్తే ఎన్పీఎస్ నుంచి తేలిగ్గా నగదు ఉపసంహరించుకోవచ్చు. అందుకు కొన్ని నియమ నిబంధనలు తయారు చేసింది కేంద్రం.. అవేమిటో ఓ లుక్కేద్దామా..
ఉద్యోగుల రిటైర్మెంట్ తర్వాత..
రిటైర్మెంట్ నాటికి ఎన్పీఎస్లో డిపాజిట్ చేసిన మొత్తంలో కనీసం 40 శాతం యాన్యుటీ బాండ్లలో పెట్టుబడి పెట్టి.. మిగతా మొత్తం ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చు. అలాకాకుండా ఒకేసారి విత్ డ్రా చేసుకోకుండా 70 ఏండ్ల వయస్సు వరకూ ఎన్పీఎస్ లోనే కొనసాగించవచ్చు. రిటైర్మెంట్ కల్లా ఎన్పీఎస్ లో రూ.5లక్షలు, అంతకంటే తక్కువ ఉంటే మొత్తం సొమ్మూ ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికి పన్ను మినహాయింపు ఉంటుంది.
ప్రభుత్వోద్యోగులు వీఆర్ఎస్పై వెళితే..
వీఆర్ఎస్పై వెళ్లే ప్రభుత్వోద్యోగులు ఎన్పీఎస్ ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తంలో 80 శాతం యాన్యూటీ బాండ్లలో పొదుపు చేయాలి. డిపాజిట్ చేసిన మొత్తం రూ.2.5 లక్షల కంటే తక్కువగా ఉంటే మొత్తం ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ కార్పొరేట్ సంస్థ ఉద్యోగి గానీ, ప్రభుత్వోద్యోగి గానీ రిటైర్మెంట్ కు ముందే మరణిస్తే మొత్తం సొమ్ము నామినీకి గానీ, చట్టబద్ధమైన వారసులకు గానీ చెల్లిస్తారు.
కార్పొరేట్ ఉద్యోగులు, ఇతర సభ్యుల స్వచ్చంద విత్ డ్రాయల్ ఇలా
కనీసం పదేండ్లు ఎన్పీఎస్లో డిపాజిట్ చేస్తేనే మధ్యలో వైదొలగడానికి అవకాశం ఉంటుంది. అలా కూడా డిపాజిట్ చేసిన మొత్తంలో 80 శాతం యాన్యుటీ బాండ్లలో పొదుపు చేయాలి. డిపాజిట్ చేసిన మొత్తం రూ.2.5 లక్షల కంటే తక్కువగా ఉంటే మొత్తం ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చు.
విత్ డ్రాయల్స్ కు సాధారణ నిబంధనలు ఇలా
ఎన్పీఎస్ పథకంలో సభ్యులుగా కొనసాగుతున్న వారు మూడు సార్లు మాత్రమే నగదు పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు. కనీసం మూడేండ్ల పాటు ఎన్పీఎస్లో మదుపు చేసిన వారే పాక్షికంగా నగదు విత్ డ్రాయల్ చేసేందుకు అర్హత కలిగి ఉంటారు. పిల్లల చదువులు, వివాహాలు, ఇంటి నిర్మాణం, వైద్య ఖర్చులకు మాత్రమే ఎన్పీఎస్ నిధులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటది. ఎన్పీఎస్ ఖాతా నుంచి కేవలం మూడు సార్లు మాత్రమే నగదు విత్ డ్రా చేసుకోవచ్చు.. ఎన్పీఎస్ ఖాతాలో జమ చేసిన మొత్తంలో 25 శాతమే విత్ డ్రా చేసుకునేందుకు నిబంధనలు అనుమతి ఇస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
KCR | కేసీఆర్ సార్ క్షమించండి!.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినం.. న్యూస్ చానల్ డిబేట్ లైవ్లో ఓ రైతు ఆవేదన
TGRTC | ఆర్టీసీ ‘దసరా’ దోపిడీ..! స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనంగా వసూళ్లు
Harishrao | తెలంగాణపై పెనుకుట్ర.. జీసీ లింకు మాటున బాబు-కేంద్రం కుతంత్రం
Medigadda | మేడిగడ్డలో నీళ్లు.. ఎత్తలేక మొసలి కన్నీళ్లు..! రైతాంగ ప్రయోజనాలు మరచి రాజకీయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

