Nokia Layoffs | స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో పాపులర్ బ్రాండ్ నోకియా భారత్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. పునర్వ్యవస్ధీకరణ ప్రణాళికల్లో భాగంగా భారత్‌లో 250 మంది ఉద్యోగులపై వేటు పడనుంది. నోకియా చేపట్టిన మార్పుల కారణంగా వందలాది ఉద్యోగులు కొలువులు కోల్పోవాల్సిన పరిస్ధితి నెలకొంది.
నోకియా 5జీ టెక్నాలజీ పట్ల భారత్‌లో డిమాండ్ తగ్గడంతో కంపెనీ పలు సమస్యలు ఎదుర్కొంటోంది. నోకియా టెక్నాలజీపై గతంలో భారీగా వెచ్చించిన కొన్ని బడా దేశీ కంపెనీలు ప్రస్తుతం దీనిపై మునుపటిలా ఖర్చు చేసేందుకు మొగ్గుచూపకపోవడంతో భారత్ మార్కెట్లో నోకియా నెగ్గుకురాగలగడం సంక్లిష్టంగా మారింది.
దీంతో నోకియా తన మనీ, టెక్నాలజీ, లీగల్ స్టఫ్ ఇన్‌ఛార్జ్‌ల వంటి పలు కీలక పొజిషన్స్‌ను వదిలించుకోవాలని చూస్తోంది. ఇక నోకియా తన కార్యకలాపాలను మొబైల్ నెట్వర్క్స్, క్లౌడ్, నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి మూడు విభాగాలుగా విభజించనుంది. ప్రతి విభాగం భారత్‌లో నోకియా వ్యాపారాల్లో వివిధ విభాగాలపై దృష్టి సారిస్తాయి.
Read More :
Brain chip | మెదడుతో మౌస్ కంట్రోల్.. న్యూరాలింక్ ప్రయోగంలో సానుకూల ఫలితం..!