Nitin Gadkari | పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు కేంద్ర మంత్రి గడ్కరీ హెచ్చరిక.. అలాగైతే ఆ ప్రాజెక్టులు రద్దు చేస్తాం..!
Nitin Gadkari | శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడకపోతే రాష్ట్రానికి కేటాయించిన ఎనిమిది ప్రధాన జాతీయ రహదారుల ప్రాజెక్టులు రద్దవుతాయని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు.
Nitin Gadkari | పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ పంజాబ్‌లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడకపోతే రాష్ట్రానికి కేటాయించిన ఎనిమిది ప్రధాన జాతీయ రహదారుల ప్రాజెక్టులను భారతీయ జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) రద్దు చేయడం గానీ, పూర్తిగా తొలగించడం గానీ చేస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు నితిన్ గడ్కరీ లేఖ రాశారు. రూ.14,288 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులు.. పంజాబ్ లో భద్రత దృష్ట్యా జాప్యం అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
జలంధర్‌లో ‘ఢిల్లీ- అమృత్ సర్ – కట్రా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతుండగా, ఇంజినీర్లు, సిబ్బందిపై దాడులు జరిగాయి. ప్రాజెక్టు క్యాంప్ ఆఫీసు పైనా, లుధియానాలోని స్టాఫ్ మీద దాడులు జరిగాయి. ఈ ఎనిమిది గ్రీన్ ఫీల్డ్ కారిడార్లలో ఒక సెగ్మెంట్ రద్దు చేసే అవకాశం ఉంటుందని నితిన్ గడ్కరీ అంచనా వేశారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు రాసిన లేఖలో నితిన్ గడ్కరీ.. ఎన్ హెచ్ఏఐ అధికారులు, కాంట్రాక్టర్లు, సిబ్బంది భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ రహదారుల ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ పెండింగ్ లో ఉన్నదని కూడా కేంద్ర మంత్రి గుర్తు చేశారు.
గత నెల 15న జరిగిన సమీక్షా సమావేశంలోనూ భూ సేకరణతోపాటు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని తమకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హామీ ఇచ్చారని నితిన్ గడ్కరీ గుర్తు చేశారు. కానీ, అందులో చెప్పుకోదగ్గ ప్రగతి కాన రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పంజాబ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

