Stock Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 300 పాయింట్లు జంప్..
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ రంగంలో తప్పా మిగతా అన్నిరంగాల్లో కొనుగోళ్లు కనిపించాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 80,661.62 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. చివరి వరకు అదే జోరును కొనసాగించాయి.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ రంగంలో తప్పా మిగతా అన్నిరంగాల్లో కొనుగోళ్లు కనిపించాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 80,661.62 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. ఈ క్రమంలో ఇంట్రాడేలో సెన్సెక్స్ 80,657.71 పాయింట్ల కనిష్ఠానికి చేరగా.. అత్యధికంగా 81,049.03 పాయింట్లకు పెరిగింది. చివరకు 294.85 పాయింట్ల లాభంతో 80,796.84 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 114.45 పాయింట్లు పెరిగి.. 24,461.15 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 2462 షేర్లు లాభాలను నమోదు చేశాయి.
మరో 1404 షేర్లు పతనం కాగా.. 171 షేర్లు మారలేదు. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి ఒక శాతం కంటే ఎక్కువ పెరిగాయి. బ్యాంకింగ్ మినహా మిగతా అన్ని రంగాల సూచీలు ఆటో, పవర్, ఎనర్జీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్, గ్యాస్ ఒక్కొక్కటి ఒకశాతం పెరిగాయి. నిఫ్టీలో అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం అత్యధికంగా లాభపడ్డాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జెఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ నష్టపోయాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

