ముకేశ్ అంబానీ వేతనం సున్నా.. వరుసగా ఆరోసారి జీతం అందుకోని రిలయన్స్ చైర్మన్
దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీ వరుసగా ఆరోసారి ఎలాంటి వేతనం అందుకోలేదు. 2008-09 నుంచి 2019-20 వరకు ప్రతియేటా రూ.15 కోట్ల వార్షిక రెమ్యునేషన్ అందుకున్న ముకేశ్.. 2020-21 నుంచి 2025-26 వరకు ఎలాంటి వేతనం తీసుకోలేదని సంస్థ వెల్లడించింది.
న్యూఢిల్లీ, మే 28: దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీ వరుసగా ఆరోసారి ఎలాంటి వేతనం అందుకోలేదు. 2008-09 నుంచి 2019-20 వరకు ప్రతియేటా రూ.15 కోట్ల వార్షిక రెమ్యునేషన్ అందుకున్న ముకేశ్.. 2020-21 నుంచి 2025-26 వరకు ఎలాంటి వేతనం తీసుకోలేదని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన డివిడెండ్ మాత్రమే తీసుకుంటున్నారు. కరోనా సమయంలో తన వేతనాన్ని పూర్తిగా విరాళం ఇచ్చిన ఆయన ఆ సమయంలో భవిష్యత్తులో జీతం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఇక అప్పటి నుంచి(2020-21 నుంచి 2025-26 వరకు) ఇప్పటి వరకు ఎలాంటి వేతనం పొందలేని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదికలో ముకేశ్ అంబానీ ఎలాంటి వేతనం తీసుకోలేదని, అలవెన్స్‌లు, రిటైర్మెంట్ ప్రయోజనాలు మాత్రం పొందారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ కన్సాలిడేటెడ్ నికర లాభం 95,754 కోట్ల లాభాన్ని ఆర్జించగా, మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.18,19,103 కోట్లకు చేరుకున్నది. కంపెనీలో 1.61 కోట్ల షేరు కలిగివున్న ముకేశ్ అంబానీ గతేడాదికిగాను రూ.9.66 కోట్ల డివిడెండ్ చెల్లింపులు జరిపారు. సంస్థలో ప్రమోటర్లు 664.5 కోట్ల షేర్లు లేదా 50.07 శాతం వాటా ఉండటంతో రూ.3,987 కోట్ల డివిడెండ్ చెల్లింపులు జరిపింది.
అలాగే అంబానీ బ్రదర్స్ నిఖిల్, హితాల్ మెస్వానీలు రూ.25 కోట్ల వార్షిక వేతనాన్ని అందుకున్నారు. వీటిలో రూ.10 కోట్లు..వేతనం, అలవెన్స్ వంటి రూపంలో ఆయన పొందారు. 2023లో కంపెనీ బోర్డులోకి చేరిన ఆయన పిల్లలు ఇషా, ఆకాశ్, అనంత్‌లు గత ఆరేండ్ల నుంచి ఎలాంటి వేతనం పొందలేదని పేర్కొంది. వీరు కేవలం వేతనం కింద రూ.12.17 కోట్లు(రూ.2.29 కోట్లు కమిషన్ కలుపుకొని) గతేడాదికిగాను పొందారు. కంపెనీ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు రామిందర్ సింగ్ గుజ్రాల్, శుమీత్ బెనర్జీ, ఎస్బీఐ మాజీ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య, మాజీ సీవీసీ కేవీ చౌదరి, బ్యాంకింగ్ వెటరన్ కేవీ కామ్లు కమిషన్ కింద రూ.2.5 కోట్లు పొందారు. అంతక్రితం ఏడాది అందుకున్న రూ.2.25 కోట్లతో పోలిస్తే భారీగా పెరిగింది.
రిటైల్ రంగం అంతంతే: రిలయన్స్
దేశీయ సంఘటిత రిటైల్ రంగం స్వల్పకాలికంగా ఒత్తిడికి గురికాకతప్పదని రిలయన్స్ రిటైల్ వెల్లడించింది. అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న స్థూల ఆర్థిక పరిస్థితులు నిరాశాజనకంగా ఉండటం ఇందుకు కారణమని, కానీ, భవిష్యత్తులో ఈ రంగం రెండంకెల వృద్ధిని నమోదు చేసుకునే అవకాశాలున్నాయని పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ రిటైల్ రూ.3 లక్షల కోట్ల విక్రయాలు జరిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

