MG Comet EV | 19న ఎంజీ మోటార్స్ బుల్లి ఎలక్ట్రిక్ కారు కొమెట్ ఆవిష్కరణ.. ధరెంతంటే?!
MG Comet EV | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్.. దేశీయ మార్కెట్లోకి తన బుల్లి ఎలక్ట్రిక్ కారు ’కొమెట్ ఈవీ’ని ఈ నెల 19న ఆవిష్కరించనున్నది.
MG Comet EV | దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ టియాగో ఈవీతో బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ మొర్రిస్ గ్యారెజెస్ (ఎంజీ మోటార్ ఇండియా) కొమెట్ ఈవీ తల పడనున్నది. `జడ్ఎస్` తర్వాత దేశీయ మార్కెట్లో ఎంజీ మోటార్స్ ఆవిష్కరిస్తున్న రెండో ఎలక్ట్రిక్ కారు `కొమెట్ (Comet)`. ఈ నెల 19న దేశీయ మార్కెట్లోకి ఎంటర్ కానున్నది. ఎంజీ మోటార్స్ ఎంట్రీ లెవల్ బుల్లి ఎలక్ట్రిక్ కారు ఇది. డాష్‌బోర్డుపై 20.6 అంగుళాల ఇంటిగ్రేటెడ్ ఫ్లోటింగ్ వైడ్ స్క్రీన్‌తో వస్తున్నది. 10.25 అంగుళాల హెడ్ యూనిట్, 10.25 అంగుళాల డిజిటల్ కస్టర్ తదితర ఫీచర్లు ఉంటాయి. అంతే కాదు చౌక ధరకే వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది.
ఈ వేరియంట్లో మార్కెట్లో అందుబాటులో ఉన్న మోడల్ కార్లు టాటా మోటార్స్ టియాగో ఈవీ (Tata Tiago.ev), సిట్రోల్ ఈ-సీ3 (Citroen e-C3)లతో ఎంజీ మోటార్స్ కొమెట్ ఈవీ తల పడుతుందని భావిస్తున్నారు. త్రీ-డోర్ ఫార్మాట్లో మార్కెట్లో వస్తున్న న్యూ చాయిస్ కారు ఇది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అమ్ముడవుతున్న ఈవీ కార్లలో టాటా టియాగో తర్వాతీ స్థానంలో ఎంజీ మోటార్స్ జడ్ఎస్ ఈవీ నిలిచింది.
నాలుగు సీట్ల ఎంజీ మోటార్స్ కొమెట్ 25 కిలోవాట్ల బ్యాటరీపై 50కిలోవాట్ల మోటార్‌పై పని చేస్తుంది. సింగిల్ చార్జింగ్‌తో 250 కి.మీ. నుంచి 300 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. ఆపిల్ ఐ-పాడ్ ఇన్స్పైర్డ్ ట్విన్-స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ట్విన్ డిస్ప్లే సెటప్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఎంజీ కొమెట్ ఈవీ కారు ధర రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య పలుకుతుండవచ్చు. ఎంజీ కొమెట్ ఈవీ కారు పోటీగా ఉన్న టాటా టియాగో ఈవీ కారు రూ.8.69 లక్షల నుంచి రూ.11.99 లక్షల మధ్య ధర పలుకుతున్నది. సిట్రోన్ ఈ-సీ3 కారు రూ.11.50 -12.76 లక్షల మధ్య లభిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

