Maruti Suzuki Fronx | మార్కెట్లోకి మారుతి సుజుకి ఫ్రాంక్స్.. బాలెనో సహా ఆ నాలుగు కార్లతో ‘సై’ అంటే ‘సై’
Maruti Suzuki Fronx | ఎంతోకాలంగా ఊరిస్తున్న మారుతి సుజుకి కంపాక్ట్ ఎస్యూవీ కారు ఫ్రాంక్స్.. భారత్ మార్కెట్లోకి వచ్చేసింది. దీని ధర రూ.7.46 లక్షల నుంచి మొదలవుతుంది. రూ.11 వేలు కట్టి కారును బుక్ చేసుకోవచ్చు.
Maruti Suzuki Fronx | గ్రాండ్ విటారా, బాలెనో తరహాలో రూపుదిద్దుకోవడంతోపాటు ఎంతోకాలంగా కార్ల ప్రియులను ఊరిస్తున్న మరో కంపాక్ట్ ఎస్యూవీ మోడల్ కారు ఫ్రాంక్స్.. దేశీయ మార్కెట్లోకి వచ్చేసింది. ఫ్రాంక్స్ బేస్ లెవెల్ కారు రూ.7.46 లక్షలకే లభిస్తుంది. 1.0 లీటర్ల కే-సిరీస్ టర్బో బూస్టర్‌జెట్ ఇంజిన్ వేరియంట్ కారు ధర రూ.9.72 లక్షల నుంచి ప్రారంభమై.. టాప్ హై ఎండ్ వేరియంట్ ధర రూ.13.13 లక్షలు పలుకుతుంది. కస్టమర్లు మారుతి సుజుకి నెక్సా డీలర్‌షిప్‌ల వద్ద రూ.11 వేలు చెల్లించి కారు బుక్ చేసుకోవచ్చు. మారుతి సుజుకి సబ్‌స్ర్కైబ్ పాలసీలో రూ.17,378లకు నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌పై సొంతం చేసుకోవచ్చు.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. సిగ్మా, డెల్టా, డెల్టా +, జెటా, అల్ఫా వేరియంట్లలో కస్టమర్లు తమకు ఇష్టమైన వేరియంట్ ఎంచుకోవచ్చు.
కార్ల ధరలు ఇలా
అడ్వాన్స్డ్ 1.2 లీటర్ల కే-సిరీస్ డ్యుయల్ జెట్, డ్యుయల్ వీవీటీ ఇంజిన్ కార్లు
వేరియంట్ —— ధర (రూపాయల్లో)
సిగ్మా5-ఎంటీ —- 7,46,500
డెల్టా -5ఎంటీ —- 8,32,500
డెల్టా -ఏజీఎస్ —- 8,87,500
డెల్టా+ 5ఎంటీ —- 8,72,500
డెల్టా + ఏజీఎస్—- 9,27,500
ఆల్ న్యూ 1.0కే సిరీస్ టర్బో బూస్టర్‌జెట్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజిన్ విత్ ప్రోగ్రెసివ్ స్మార్ట్ హైబ్రీడ్
వేరియంట్ ——————– ధర (రూపాయల్లో)
డెల్టా + 5ఎంటీ —————- 9,72,500
జెటా 5ఎంటీ ——————- 10,55,500
జెటా 6ఏటీ ——————– 12,05,500
అల్ఫా 5ఎంటీ —————- 11,47,500
అల్ఫా 6ఏటీ —————— 12,97,500
అల్ఫా డ్యుయల్ టోన్ ఎంటీ — 11,63,500
అల్ఫా డ్యుయల్‌టోన్ ఏటీ —-13,13,500
ఫ్రాంక్స్ కలర్ ఆప్షన్స్ ఇలా
మారుతి సుజుకి ఫ్రాంక్స్ కంపాక్ట్ ఎస్యూవీ 10 మోనోటోన్, డ్యుయల్-టోన్ పెయింట్ స్కీమ్స్‌లో లభ్యం అవుతుంది. 7-మోనోటోన్ షేడ్స్‌లో ఆర్కిటిక్ వైట్, స్ప్లెండిడ్ సిల్వర్, గ్రాండౌర్ గ్రే, బుల్లిష్ బ్లాక్, సెలెస్టియల్ బ్లూ, ఒపులెంట్ రెడ్, ఎర్త్రన్ బ్రౌన్ ఆప్షన్లలో లభిస్తుంది. డ్యయల్ టోన్ కలర్ కాంబినేషన్లో స్ప్లెండిడ్ సిల్వర్ విత్ బ్లూయిష్ బ్లాక్ రూఫ్, ఒపులెంట్ రెడ్ విత్ బ్లూయిష్ బ్లాక్ రూఫ్, ఎర్త్రన్ బ్రౌన్ విత్ బ్లూయిష్ బ్లాక్ రూఫ్ ఆప్షన్లలోనూ కొనుగోలు చేయొచ్చు.
ఈ రెండు కార్ల స్ఫూర్తితో డిజైన్ ఇలా
గ్రాండ్ విటారా, బాలెనో డిజైన్ల స్ఫూర్తితో రూపుదిద్దుకున్నదే ఫ్రాంక్స్ ఎస్యూవీ. స్లీకర్ లుకింగ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్ఎల్స్, లార్జ్ హెక్సా గోనల్ గ్రిల్లె సెపరేటెడ్ బై క్రోమ్ బార్, గ్రే కలర్లో ఫాక్స్ స్కిడ్ ప్లేటతో కూడి ప్రంట్ బంపర్, 16-అంగుళాల ప్రిసిషన్ కట్ డ్యుయల్ టోన్ అల్లాయ్ వీల్స్, రేర్ సిగ్నేచర్ ఎల్ఈడీ బ్లాక్ టెయిల్ ల్యాంప్స్, రూఫ్‌పై ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఎలిమెంట్ తదితర ఫీచర్లు ఉంటాయి.
ఇవీ ఫ్రాంక్స్ ఫీచర్లు
మారుతి సుజుకి ఫ్రాంక్స్ లోపల 9.0-అంగుళాల హెచ్డీ స్మార్ట్ ప్లే ప్రో+ ఇన్ఫోటైన్మెంట్ విత్ వైర్లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఏఆర్కేఎఎంవైఎస్ సౌండ్ సిస్టమ్, సుజుకి కనెక్ట్ విత్ 40+ కనెక్టెడ్ కారు ఫీచర్లు, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, హెచ్యూడీ యూనిట్, 360-డిగ్రీల కెమెరా, క్రూయిజ్ కంట్రోల్ తదితర ఫీచర్లు జత చేశారు.
- ఫ్రాంక్స్ ఆల్ న్యూ 1.0 లీటర్ల కే-సిరీస్ టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజిన్.. ప్రోగ్రెసివ్ స్మార్ట్ హైబ్రీడ్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్నది.
- ఈ ఇంజిన్ గరిష్టంగా 99 హెచ్‌పీ విద్యుత్, 147 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
- కస్టమర్లు 1.2 లీటర్ల కే-సిరీస్ డ్యుయల్ జెట్, డ్యుయ్ వీవీటీ ఇంజిన్ విత్ ఐడిల్ స్టార్ స్టాప్ టెక్నాలజీ ఫీచర్లు గల మోడల్‌ను ఎంచుకోవచ్చు.
- ఈ ఇంజిన్ గరిష్టంగా 89 హెచ్‌పీ విద్యుత్, 113 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
- 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 5-స్పీడ్ ఏజీఎస్ ట్రాన్స్మిషన్, సిక్స్-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్లు ఇలా
హార్ట్‌టెక్ ప్లాట్‌ఫామ్‌పై సుజుకి ఫ్రాంక్స్ కారు నిర్మాణం జరిగింది. ఆరు ఎయిర్ బ్యాగ్స్ (డ్రైవర్, కో డ్రైవర్, సైడ్, కైర్టెన్), త్రీ పాయింట్ ఈఎల్ఆర్ సీట్ బెల్ట్స్, ఈఎస్పీ విత్ హిల్‌హోల్డ్ అసిస్ట్, రోల్ ఓవర్ మిటిగేషన్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ తదితరాలు ఉన్నాయి.
మారుతి సుజుకికే చెందిన బాలెనోతోపాటు టాటా పంచ్, సిట్రోన్ సీ3, రెనాల్ట్ కైగర్, నిసాన్ మాగ్నైట్ వేరియంట్లతో పోటీ పడుతుంది ఫ్రాంక్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

