Home Loans | ఇండ్లరుణాలపై వడ్డీరేట్లు పెంచిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్.. !
Home Loans | ఇండ్ల రుణాలపై ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ వడ్డీరేట్లు 35 బీపీఎస్ పెంచడంతో ఇండ్ల రుణ వడ్డీ 8.65 శాతం నుంచి మొదలవుతుంది.
Home Loans | ఇండ్ల రుణాలపై ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్) కీలక వడ్డీరేట్లు సవరించింది. ఇండ్ల ధరలకు అనుగుణంగా 35 బేసిక్ పాయింట్లు.. బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్లు (బీపీఎల్ఆర్) పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. తక్షణం పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు ఇప్పుడు 8.65 శాతం నుంచి ప్రారంభం అవుతాయి. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వెబ్సైట్ ప్రకారం రివైజ్డ్ ప్రైమ్ లెండింగ్ రేట్ 16.45 శాతం.
వేతన జీవులు, ప్రొఫెషనల్స్‌కు రూ.15 కోట్ల వరకు ఇండ్ల రుణాలు ఇవ్వనున్నది ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్. వీరి సిబిల్ స్కోర్ 800, అంతకంటే ఎక్కువగా ఉంటే 8.30 శాతం వడ్డీరేటుపైనే రుణాలివ్వనున్నది. సిబిల్ స్కోర్ 750-799 మధ్య ఉంటే 8.40 శాతం వడ్డీపై రూ.5 కోట్లు, రూ.5 కోట్ల నుంచి రూ.15 కోట్లకు 8.60 శాతం వడ్డీకి ఇండ్ల ఇవ్వనున్నది. సిబిల్ స్కోర్ 700-749 మధ్య ఉంటే రూ.50 లక్షల వరకు 8.70 శాతం, రూ.50-2 కోట్ల రుణాలకు 8.90 శాతం వడ్డీ వసూలు చేస్తుంది.
ఆస్తి విలువ ———– మంజూరు చేసే రుణం మొత్తం
90 శాతం ————– రూ.30 లక్షలు
80 శాతం ————- రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షలు
75 శాతం ————- రూ.75 లక్షల పై చిలుకు
- వేతన జీవులకు గరిష్టంగా 30 ఏండ్ల వరకు ఇంటి రుణ చెల్లింపు గడువు ఉంటుంది.
- స్వయం ఉపాధిపై జీవిస్తున్న వారికి 25 ఏండ్ల వరకు రుణ చెల్లింపునకు అనుమతి ఇస్తుంది.
ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ ఆధ్వర్యంలో.. భారత పౌరులకు, ఎన్నారైలకు ఇండ్ల రుణాలు మంజూరు చేస్తుంది. ప్లాట్ లోన్లు, హోం ఇంప్రూవ్మెంట్ రుణాలు, హోం రెనోవేషన్ లోన్స్, టాప్అప్ లోన్, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ రుణాలు ఇస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

