LIC Housing Finance | ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఎఫ్డీ వడ్డీరేట్లు సవరణ.. డిటైల్స్ ఇవి..!
LIC Housing Finance | ఆర్బీఐ రెపొరేట్ పెంపుదలకు అనుగుణంగా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు సవరించింది.
LIC Housing Finance | ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్) సవరించేసింది. ఈ నెల 24 నుంచి సవరించిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయి. ఈ నెల నాలుగో తేదీన రెపోరేట్ 40 బేసిక్ పాయింట్లు పెంచుతూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నిర్ణయం తీసుకోవడంతో తదనుగుణంగా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా డిపాజిట్లపై వడీరేట్లు సవరించింది. ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్లో ప్రస్తుతం డిపాజిట్లపై 5.60-6.60 శాతం వడ్డీరేట్లు అమలవుతున్నాయి. కనిష్టంగా ఏడాది.. గరిష్ఠంగా ఐదేండ్ల లోపు గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. భారతీయులు, ప్రవాస భారతీయులు (ఎన్నారై), సంరక్షకుల ద్వారా పిల్లలు, హిందూ ఉమ్మడి కుటుంబాలు, భాగస్వామ్య సంస్థలు, సహకార సంఘాలు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, ట్రస్టులు తదితరులు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయొచ్చు.
హెచ్‌యూఎల్ హెచ్ఎఫ్ఎల్ క్యుములేటివ్ పబ్లిక్ డిపాజిట్
క్యుములేటివ్ పబ్లిక్ డిపాజట్ స్కీం కింద ఏడాది, 18 నెలలు, రెండేండ్లు, మూడేండ్లు, ఐదేండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు అమలవుతున్నాయి. డిపాజిట్ గడువు మెచ్యూరిటీ దాటిన తర్వాత అసలుతోపాటు వడ్డీ మొత్తం తిరిగి డిపాజిటర్ సేవింగ్స్ ఖాతాలో జమ అవుతుంది. కనీసంగా రూ.20 వేలు డిపాజిట్ చేయొచ్చు. తదుపరి రూ.1000 చొప్పున డిపాజిట్ చేయొచ్చు.
క్యుములేటివ్ పబ్లిక్ డిపాజిట్ స్కీంపై వడ్డీరేట్లు ఇలా
- ఏడాది వరకు 5.60 శాతం
- 18 నెలల వరకు 5.90 శాతం
- రెండేండ్ల వరకు 6.25 శాతం
- మూడేండ్ల వరకు 6.40 శాతం
- ఐదేండ్ల వరకు 6.60 శాతం
నాన్ క్యుములేటివ్ పబ్లిక్ డిపాజిట్
ఈ పథకం కింద డిపాజిటర్లకు రెండు రకాల ఆప్షన్లు ఉంటాయి. నెలవారీ, వార్షిక వడ్డీరేటు చెల్లింపు ఆప్షన్లలో మీకు నచ్చింది ఎంచుకోవచ్చు. ఏడాది, 18 నెలలు, 2 ఏండ్లు, మూడేండ్లు, ఐదేండ్ల గడువుతో కూడిన ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చు. ఏడాది ఆప్షన్ ఎంచుకుంటే ప్రతియేటా మార్చి 31న వడ్డీరేటు క్రెడిట్ అవుతుంది. నెలవారీ ఆప్షన్ ఎంచుకున్న వారికి తొలి నెల, 31వ నెలలో వడ్డీరేటు చెల్లింపులు జరుగుతాయి.
నాన్ క్యుములేటివ్ పబ్లిక్ డిపాజిట్ వడ్డీరేట్లు
ఏడాది గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్‌పై నెలవారీ ఆప్షన్ 5.45%.. ఏడాది ఆప్షన్ వడ్డీరేటు .. 5.60 %
18 నెలల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్‌పై నెలవారీ ఆప్షన్ 5.75%.. ఏడాది ఆప్షన్ వడ్డీరేటు .. 5.90 %
రెండేండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్‌పై నెలవారీ ఆప్షన్ 6.10%.. ఏడాది ఆప్షన్ వడ్డీరేటు .. 6.25 %
3ఏండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్‌పై నెలవారీ ఆప్షన్ 6.25%.. ఏడాది ఆప్షన్ వడ్డీరేటు .. 6.40 %
5 ఏండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్‌పై నెలవారీ ఆప్షన్ 6.45%.. ఏడాది ఆప్షన్ వడ్డీరేటు .. 6.60 %
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ బ్యాంక్ ఖాతాలో చెక్ ద్వారా గానీ, ఆర్టీజీఎస్ ద్వారా గానీ, నెఫ్ట్ ద్వారా గానీ, ఐఎంపీఎస్ ట్రాన్స్ఫర్ ద్వారా వడ్డీ చెల్లింపలు జరుగుతాయి. చెక్‌లు, ఆన్లైన్ ట్రాన్స్ ఫర్ (ఆర్టీజీఎస్/నెఫ్ట్ / ఐఎంపీఎస్) ద్వారా డిపాజిట్ చెల్లింపులు అనుమతిస్తుంది ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్. ఇదిలా ఉంటే సీనియర్ సిటిజన్లకు రూ.20 కోట్ల వరకు అన్ని రకాల డిపాజిట్లపై .25 శాతం వడ్డీ అదనంగా లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

