హైదరాబాద్, మార్చి 28: ప్రముఖ ఫార్మా దిగ్గజం హెటిరో మరో ఔషధాల ఎగుమతులను ప్రారంభించింది. మధుమేహం, ఊబకాయం చికిత్సలో వాడే జనరిక్ ఔషధం సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ల ఇతర దేశాలకు ఎగుమతులను ప్రారంభించినట్టు కంపెనీ ప్రకటించింది. ఈ మందులను ట్రూగ్లిక్స్, రోల్మోడ్ల్, మోటో జీ బాండ్ల పేరుతో విక్రయించనున్న ఈ ఔషధాలను ఆఫ్రికా, ఆసియా, మధ్యతూర్పు దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు కంపెనీ ఎండీ వంశీకృష్ణ బండి తెలిపారు.
ప్రస్తుతం కొన్ని దేశాలకు మాత్రమే ఎగుమతి చేస్తున్న సంస్థ.. దశల వారీగా వీటిని 75 దేశాలకు ఎగుమతి చేయనున్నట్టు ప్రకటించారు.