ITR | ఈ-పోర్టల్లో సమస్యలు.. సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్న టాక్స్ పేయర్లు..!
ITR | ఐటీఆర్ ఫైలింగ్ గడువు దగ్గర పడుతున్నా కొద్దీ.. ఈ-ఫైలింగ్ పోర్టల్ లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పన్ను చెల్లింపుదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ITR | గత ఆర్థిక సంవత్సరా (2023-24)నికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి తుది గడువు ఈనెల 31తో ముగుస్తుంది. పన్ను చెల్లించే వారు ఐటీ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి మరో కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలింది. ఈ నెలాఖరు తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే మాత్రం.. పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది.
ఐటీఆర్ ఫైలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ.. ఈ-ఫైలింగ్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు, ఇతర ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. కనుక గడువు తేదీలోపు మీరు ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి చేయాలని, తద్వారా సమస్యలను తప్పించుకోవాలని అంటున్నారు. ఇన్కం టాక్స్ వెబ్సైట్లో లాగిన్ అయిన ఈ -ఫైలింగ్ పోర్టల్లో డిటైల్స్ అప్ డేట్ చేస్తున్నప్పుడు పన్ను చెల్లింపుదారులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తు్న్నారు. ఇప్పటికీ ఐటీఆర్ ఫైల్ చేయకుంటే.. గడువు లోపు ఆదాయం పన్ను విభాగం వెబ్ సైట్ పని చేస్తుందా..? లేదా..? అనే విషయాన్ని చెక్ చేసుకోవాలని అంటున్నారు.
ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు ఇన్ కం టాక్స్ పోర్టల్ నెమ్మదిగా పని చేస్తుందనుకోండి.. అప్పుడు ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి కావడానికి ఒక ఏడాది టైం పడుతుందని, పలు సాంకేతిక అంశాలతో ఆ వెబ్ సైట్ మరింత నెమ్మదిగా పని చేస్తుందని పలువురు టాక్స్ పేయర్లు తెలిపారు. కనుక ఐటీఆర్ ఫైల్ చేసే ప్రతి ఒక్కరూ బ్రౌజర్ క్యాచె క్లీన్ చేసి తిరిగి ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియ చేపట్టాలని చెబుతున్నారు. అప్పటికీ పలు సమస్యలు తలెత్తితే మీ పాన్ నంబర్, మొబైల్ నంబర్ వివరాలను orm@cpc.incometax.gov.in లో నమోదు చేస్తే ఆదాయం పన్ను విభాగం టీం మిమ్మల్ని సంప్రదించి, సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తుందని ఆదాయం పన్ను విభాగం అధికారులు చెబుతున్నారు. గత మూడు నాలుగు రోజులుగా పలుసార్లు ప్రయత్నించినా మీ వెబ్ సైట్ సరిగ్గా పని చేయకున్నా, సకాలంలో ఐటీఆర్ ఫైల్ చేయడానికి చర్యలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
ఐటీఆర్ ఫైలింగ్తోపాటు ఈ-వెరిఫికేషన్ తర్వాత ప్రాసెసింగ్ కావడానికి సగటున 15-45 రోజుల టైం పడుతుందని ఆదాయం పన్ను నిపుణులు చెబుతున్నారు. ఐటీ రిటర్న్స్, ఇతర అంశాలను బట్టి ప్రాసెసింగ్ టైం ఆధార పడి ఉంటుందన్నారు. ఆఫ్ లైన్ పద్దతి ప్రకారం ఐటీఆర్-5 వెరిఫికేషన్ పూర్తి చేస్తే, అది ప్రాసెస్ కావడానికి 15-45 రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. ఆదాయంపన్ను చట్టం-1961లోని 143(1) సెక్షన్ ప్రకారం ఐటీఆర్ ఫైల్ చేసిన ప్రతి ఒక్కరికీ నోటిఫికేషన్ వస్తుంది. దీని ప్రకారం ఐటీఆర్ ఫైల్ చేసిన తొమ్మిది నెలల్లో నోటిఫికేషన్ ఇవ్వకపోతే వచ్చే డిసెంబర్ లోపు ఇంటిమేషన్ నోటీసు వస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

