PAN Card | ఆధార్‌తో పాన్‌కార్డు లింక్ చేయలేదా? ఈ లావాదేవీలు ఏవీ చేయలేరు!
PAN Card | ఆధార్‌తో అనుసంధానంకాని పాన్‌తో ఏ ఉపయోగం ఉండదు. పలు లావాదేవీలకు పాన్ కార్డును లేదా నంబర్‌ను కోట్ చేయడం తప్పనిసరి. అయితే పాన్‌తో ఆధార్ నంబర్‌ను లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ నిర్దేశించిన జూన్ 30 గడువు ముగిసినందున, లింక్కాని పాన్ కార్డులు జూలై 1 నుంచి పనికిరావు.
PAN Card | ఆధార్‌తో అనుసంధానంకాని పాన్‌తో ఏ ఉపయోగం ఉండదు. పలు లావాదేవీలకు పాన్ కార్డును లేదా నంబర్‌ను కోట్ చేయడం తప్పనిసరి. అయితే పాన్‌తో ఆధార్ నంబర్‌ను లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ నిర్దేశించిన జూన్ 30 గడువు ముగిసినందున, లింక్కాని పాన్ కార్డులు జూలై 1 నుంచి పనికిరావు. ఆదాయపు పన్ను నిబంధనల్లోని రూల్ 114బి ప్రకారం పలు రకాల లావాదేవీలకు పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) కోట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పాన్ ఇన్ఆపరేటివ్ అయితే ఆయా లావాదేవీలు మీరు పూర్తిచేయలేరు. ఉదాహరణకు పాన్ చెల్లకపోతే బ్యాంక్ ఖాతాలో రూ.50,000 మించి డిపాజిట్ చేయడం, అంతే మొత్తానికి మించి బీమా ప్రీమియం చెల్లించాలన్నా వీలు పడదు.
పాన్ యాక్టివేషన్లో లేకపోతే నిర్వహించలేని లావాదేవీలు ఇవి..
- బ్యాంక్‌లో కొత్త ఖాతాను తెరవడం.
- క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్‌కు దరఖాస్తు చేయడం
- డిపాజిటరీతో డీమ్యాట్ ఖాతాను తీసుకోవడం.
- హోటల్ లేదా రెస్టారెంట్లో రూ.50,000 మించి బిల్లును నగదుతో చెల్లించడం
- ఏ విదేశీ ప్రయాణానికైనా రూ.50,000 మించి నగదును చెల్లించడం లేదా విదేశీ కరెన్సీని కొనుగోలు చేయడం.
- మ్యూచువల్ ఫండ్ యూనిట్ల కొనుగోలుకు రూ. 50,000 మించి చెల్లించడం.
- బాండ్లు, డిబెంచర్ల కొనుగోలుకు ఏదైనా కంపెనీకి లేదా సంస్థకు రూ. 50,000 మించి చెల్లింపుచేయడం.
- రిజర్వ్ బ్యాంక్ జారీచేసే బాండ్ల చెల్లింపునకు రూ.50,000 మించి నగదు.
డిపాజిట్ చేయడం
- బ్యాంక్ లేదా సహకార బ్యాంక్‌లో ఒకే రోజున రూ.50,000 మించిన నగదు డిపాజిట్ చేయడం.
- బ్యాంక్ డ్రాఫ్ట్‌లు లేదా పే ఆర్డర్లు లేదా బ్యాంకర్స్ చెక్‌లను తీసుకోవడానికి 50వేలు మించిన మొత్తాన్ని చెల్లించడం
- ఆర్బీఐ జారీచేసే ప్రీ-పెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం రూ.50,000 మించి ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు లేదా బ్యాంక్ డ్రాఫ్ట్ లేదా పే ఆర్డర్ లేదా చెక్ ద్వారా చెల్లించడం.
- బ్యాంక్ లేదా కో ఆపరేటివ్ బ్యాంక్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో 50వేలు మించి టర్మ్ డిపాజిట్ చేయడం.
- జీవిత బీమా ప్రీమియంగా ఒక ఆర్థిక సంవత్సరంలో బీమా సంస్థకు రూ.50,000 మించి చెల్లించడం.
- స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్‌కాని కంపెనీల షేర్లను ఒక లావాదేవీలో రూ.1 లక్షకు మించి కొనడం లేదా విక్రయించడం.
- ఒక లావాదేవీలో రూ.1 లక్షకు మించి సెక్యూరిటీల (షేర్లు కాకుండా) కొనుగోలు లేదా అమ్మకం.
అధిక పన్ను కట్టాల్సిందే
- పాన్ ఇన్ఆపరేటివ్ అయితే కొన్ని ఆర్థిక లావాదేవీలకు పన్ను అధికంగా చెల్లించాల్సి వస్తుంది. టీడీఎస్‌లో ఎక్కువ కోత పడుతుంది. టీసీఎస్‌ను అధికంగా చెల్లించాలి. ఆ లావాదేవీలివి..
- వాహన క్రయ విక్రయాలు
- రూ.10 లక్షలకు మించిన స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకం. ఐటీ యాక్ట్ సెక్షన్ 50సిలో స్టాంప్ వాల్యుయేషన్ అథారిటీ నిర్దేశించిన ఆస్తి విలువ రూ.10 లక్షలకు మించితే.
- స్థిరాస్తి మినహా ఏ ఇతర వస్తువులు, సర్వీసుల కొనుగోలు లేదా విక్రయం రూ. 2 లక్షలకు మించితే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

