న్యూయార్క్, ఆగస్టు 31: యాపిల్ సీఈవోగా జాన్ టెర్నస్ నియమితులయ్యారు. గత పదిహేనేండ్లుగా సీఈవోగా విధులు నిర్వహించిన టీమ్ కూక్స్ స్థానంలో జాన్ టెర్నస్ పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. 2001లో యాపిల్ డిజైన్ టీమ్ లో చేరిన ఆయన..హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎదిగారు. కంపెనీకి చెందిన అన్ని రకాల ఉత్పత్తులు ఆయన సారథ్యంలోని టీమ్ తయారు చేసినవి కావడం విశేషం.
సెప్టెంబర్ 9న జరుగనున్న ఐఫోన్ ఇవెంట్లో తన తొలి ఫోల్డబుల్ హ్యాండ్సెంట్ను విడుదల చేయబోతున్నది. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందిన టెర్నస్..యాపిల్‌లో పనిచేయడానికి కంటే ముందు వర్చ్యువల్ రీసెర్చ్ సిస్టమ్స్‌లో విధులు నిర్వహించారు. కంపెనీలో ఉత్పత్తులను మన్నికైనవిగా, విశ్వసనీయమైనిగా తయారు చేయడానికి ఆయన చేసిన కృషి వల్లనే సాధ్యమైంది.