ఒక్క రోజులోనే జెఫ్ బెజోస్ 80వేల కోట్ల సంపద ఆవిరి.. మస్క్‌కి 70 వేల కోట్ల నష్టం
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ( Jeff Bezoz ) ఒక్కరోజులోనే 9.8 బిలియన్ డాలర్లు నష్టపోయారు. ఎలన్ మస్క్ ( Elon Musk ) 8.4 బిలియన్ డాలర్లు కోల్పోయారు.
Jeff Bezoz | అమెరికాలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే మించి ప్రభావం చూపిస్తోంది ! చూస్తుండగానే కుబేరుల సంపదను కోట్లలో ఆవిరి చేస్తుంది. అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ( Jeff Bezoz ) మంగళవారం ఒక్కరోజులోనే 9.8 బిలియన్ డాలర్ల నష్టం చవిచూడాల్సి వచ్చింది. అంటే మన కరెన్సీలో 80 వేల కోట్ల రూపాయలు అన్నమాట !! జెఫ్ బెజోస్ ఒక్కరే కాదు టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ( Elon Musk ) 8.4 బిలియన్ డాలర్లు ( రూ.70వేల కోట్లు ) నష్టపోయారు. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా స్పష్టం చేసింది. అమెరికా ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ ( CPI ) జూలైతో పోలిస్తే 0.1 శాతం పెరగడమే ఇందుకు కారణమని వెల్లడించింది.
కాగా అమెరికా ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 8.1 శాతంగా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. కానీ అది 8.3 శాతం మేర పెరిగింది. దీని ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో గత ఐదు రోజులుగా అమెరికా స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం వాల్‌స్ట్రీట్ ( wall street stock market ) షేర్లన్నీ కుప్పకూలాయి. డౌ జోన్స్ ( Dow Jones ) 1300 పాయింట్లు .. ఎస్ అండ్ పీ 500 ( S&P 500 ) ఏకంగా 4.3 శాతం పడిపోయింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని బిలియనీర్ల సంపద భారీగా పడిపోయింది.
ఇంకా ఎవరెవరు ఎంత నష్టపోయారంటే..
| మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ( mark zuckerberg ) | 4 బిలియన్ డాలర్లు |
| గూగుల్ ఫౌండర్లు లారీ పేజ్ ( larry page ), సెర్గీ బ్రిన్ ( sergey brin ) | 4 బిలియన్ డాలర్ల చొప్పున |
| స్టీవ్ బామర్ ( steve ballmer ) | 4 బిలియన్ డాలర్లు |
| వారెన్ బఫెట్ ( warren buffett ) | 3.4 బిలియన్ డాలర్లు |
| బిల్‌గేట్స్ ( bill gates ) | 2.8 బిలియన్ డాలర్లు |
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

