వచ్చే ఏడాదే కమీషన్ పరిమితులు?
బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ.. ఇన్సూరెన్స్ కమీషన్‌కు సంబంధించి పెట్టిన పరిమితులు వచ్చే ఏడాది నుంచే అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: జనవరి 1 లేదా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే వీలున్నట్టు ఐఆర్డీఏఐ సభ్యురాలు గిరిజా సుబ్రమణ్యన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బ్రోకర్లు, ఇతర పంపిణీదారులకు బీమా కంపెనీలు చెల్లించే కమీషన్లపై గత నెల ఐఆర్డీఏఐ పరిమితుల్ని విధించిన విషయం తెలిసిందే. బీమాను మరింత మందికి దగ్గర చేసేందుకు, పాలసీదారులపై బీమా కొనుగోలుకు అవుతున్న ఖర్చుల భారాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయానికొచ్చింది.
ఆరోగ్య, జీవిత, ప్రాపర్టీ, ప్రాణనష్ట బీమాలన్నింటికీ ఈ పరిమితులు వర్తిస్తాయి. కాగా, ఈ నెల 25లోగా ఈ సంస్కరణలపై బీమా సంస్థలు, బ్రోకర్లు, ఇతర భాగస్వాములు తమకున్న అభ్యంతరాలు, అభిప్రాయాలను తెలియపర్చవచ్చని ఐఆర్డీఏఐ పేర్కొన్నది. వీటిని పరిశీలించాకే ముసాయిదా రెగ్యులేషన్లు జారీ చేస్తామని గిరిజ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఉంటుందని, ఆపైనే తుది మార్గదర్శకాలు వస్తాయని ఆమె అన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

