IRCTC | విమాన ప్రయాణికులకు ఐఆర్సీటీసీ స్పెషలాఫర్.. అదేమిటంటే..?!
IRCTC | భారతీయ రైల్వేస్ అనుబంధ ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ).. తన ఫౌండేషన్ డే సందర్భంగా ఈ నెల 27న విమాన టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు కన్వినియన్స్ ఫీజు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.
IRCTC | భారతీయ రైల్వేస్ అనుబంధ.. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తన వ్యవస్థాపక వార్షికోత్సవం సందర్భంగా కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ఈ నెల 27 నాటికి ఐఆర్సీటీసీ ఏర్పాటై 24 ఏండ్లు పూర్తయిన సందర్భంగా విమాన టికెట్ల కొనుగోలు దారుల నుంచి కన్వినియన్స్ ఫీజు వసూలు చేయబోమని తెలిపింది. ఈ ఆఫర్ ఈ నెల 25 నుంచి 27 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్’ ఖాతాలో పేర్కొంది. అంతే కాదు సెప్టెంబర్ 27వ తేదీ.. ప్రపంచ పర్యాటక దినోత్సవం కూడా కావడం గమనార్హం.
ప్రతిఏటా సెప్టెంబర్ 27న ఫౌండేషన్ డే జరుపుకుంటున్న ఐఆర్సీటీసీ.. ఈ మూడు రోజులు తన వెబ్ సైట్ నుంచి విమాన టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికుల నుంచి కన్వినియన్స్ ఫీజు వసూలు చేయబోమని తెలిపింది. సెలెక్టెడ్ బ్యాంకుల డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారికి రూ.2000 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. అంతే కాదు.. పోర్టల్ నుంచి బుక్ చేసుకునే ప్రతి టికెట్ మీద రూ.50 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్ అందిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

